2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని.. అప్పటి నుంచి కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతూ వస్తూ ఉన్నాడు. దీంతో ఇక ధోని ఆటను చూసేందుకు ప్రతి ఐపీఎల్ సీజన్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాలి.  ఇకపోతే 41 ఏళ్ళ వయసులో కూడా ధోని యువ ఆటగాళ్లకు ఎక్కడ తీసిపోని విధంగా మైదానంలో చురుకుగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే ఇక  ఈ ఏడాది ధోనీకి చివరి ఐపిఎల్ అనే టాక్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగస్వామ్యం అవుతాడు అనే ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. ఇదే విషయంపై దక్షిణాఫ్రికా టీ20 లీగ్ కమిషనర్ గా కొనసాగుతున్న గ్రేమ్ స్మిత్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ఛాన్స్ ఉందంటే ధోనిని వదులుకోబోము అంటూ గ్రేమ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. ధోని లాంటి అద్భుతమైన ఆటగాడు దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో భాగస్వామ్యం కావడం మాకెంతో గర్వకారణంగా ఉంటుంది. అయితే మేము ఎప్పుడూ చెప్పేది ఇప్పుడు చెబుతుంది కూడా ఒకటే.. ఎప్పుడు బీసీసీఐ తో పని చేస్తూ ఉంటాం తప్పక గౌరవిస్తాం.


 బీసీసీఐకి ఇలాంటి టి20 లీగ్లు ప్రపంచ కప్ లు నిర్వహించిన అనుభవం ఉంది అంటూ గ్రేమ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు కుర్రాళ్లు, యువకులతో అద్భుతంగా సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.. ఒకవేళ ధోని లాంటి దిగజం మాతో కలిస్తే మాత్రం మరింత విలువ చేకూరుతుంది. ఎంతో కాలం  పాటు టీమ్ ఇండియా తో పాటు ఐపీఎల్ లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. అలాంటి ధోని ఇక సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో కి వస్తే మాకు ఎంతో గర్వకారణం.. అతని తీసుకురావడానికి ఎలాంటి అవకాశం ఉన్న వదులుకోము అంటూ గ్రేమ్ స్మిత్ తెలిపాడు. మరి రిటైర్మెంట్ తర్వాత ధోని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: