టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ అటు జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా కొనసాగుతూ ఉన్నాడు. ఇక ప్రపంచ రికార్డులు కొల్లగొట్టడంలో కూడా అటు రోహిత్ శర్మ తనకు తాను సాటి అని చెప్పాలి. అయితే ఒకప్పుడు అలవోకగా డబుల్ సెంచరీలు సాధించి ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన రోహిత్ శర్మ.. గత కొన్ని రోజుల నుంచి మాత్రం సెంచరీ అనే పదానికి దూరమైపోయాడు అని చెప్పాలి. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ అడప దడపా ప్రదర్శన చేస్తున్నాడు తప్ప.. ఇక సెంచరీ చేయలేకపోతున్నాడు.


 అయితే మొన్నటి వరకు విరాట్ కోహ్లీ  సెంచరీలు చేయడం విషయంలో మూడేళ్ల గ్యాప్ రావడంతో అతనిపై ఏ రేంజ్ లో విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ స్థానంలో ఉండడంతో ఇక అతనిపై కాస్త తక్కువగానే విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. కానీ కొంతమంది మాజీ ఆటగాళ్లు మాత్రం రోహిత్ శర్మ సెంచరీ చేయకపోవడం పై స్పందిస్తూ ఇక విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై మాజీ ఆటగాడు వసీం జాఫర్ సైతం స్పందించాడు.



 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ కొడితే చూడాలని ఉంది అంటూ టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ వసీం జాఫర్ వ్యాఖ్యానించాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ సెంచరీ బాది దాదాపు మూడేళ్లు గడిచిపోతుంది అంటూ వసీం జాఫర్ గుర్తు చేశాడు. ఇక రోహిత్ బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ మూడు అంకెల స్కోరు మాత్రం రావడం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. అందుకే ఇక రోహిత్ శర్మ బ్యాట్ నుంచి సెంచరీ వస్తే చూడాలని ఉంది అంటూ ఆశపడ్డాడు వసీం జాఫర్. కాగా 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 119 పరుగులు చేయగా.. ఇక వన్డే ఫార్మాట్లో రోహిత్ కు అదే చివరి సెంచరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: