దాదాపు మూడేళ్లపాటు ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడిన విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత మునుపటి అందుకుని బ్యాటింగ్లో చెలరేగిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఎప్పటి లాగానే వరల్డ్ రికార్డులు  క్రియేట్ చేయడంలో బిజీ బిజీగా మారిపోయాడు. ఛాన్స్ దొరికిందంటే చాలు అటు సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు అంటే చాలు సెంచరీ చేస్తాడని లేదంటే భారీగా పరుగులు చేయడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.


 న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డేలో తీవ్రంగా నిరాశపరిచాడు విరాట్ కోహ్లీ. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. ఇక ఆ తర్వాత రెండో వన్డెలో అయిన విరాట్ కోహ్లీ రాణిస్తాడని అనుకుంటే.. 11 పరుగులు మాత్రమే చేసి స్టాంప్ అవుట్ గా వెనితిరిగాడు అని చెప్పాలి. అయితే రెండు వన్డే మ్యాచ్లో విఫలం అయిననంత మాత్రాన కోహ్లీని తక్కువ చేసి చూడలేం. కానీ ఒక విషయంలో మాత్రం కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం గత కొంతకాలంగా అతని బ్యాటింగ్ తీరు చూస్తే అర్థమవుతుంది. న్యూజిలాండ్తో జరిగిన తొలి రెండు వన్డేల్లో కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు కోహ్లీ.


 ఇలా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఆడటంలో చాలా ఏళ్లు గానే ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. దీంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అటు కోహ్లీకి బౌలింగ్ వేసాడు అంటే వికెట్ పడటం ఖాయం అన్న విధంగానే ప్రస్తుతం అభిమానుల్లో కూడా భావన ఏర్పడింది. గతంలో బంగ్లాదేశ్ బౌలర్ షకీబుల్ హాసన్, సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్, ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్లలో ఆడటానికి ఇబ్బంది పడి వికెట్ సమర్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. బంతి లోపలికి వస్తే సమర్థవంతంగా ఎదుర్కొంటున్న కోహ్లీ బంతి బయటకు వెళ్తే మాత్రం ఆడేందుకు ఇబ్బంది పడుతూ చివరికి వికెట్ సమర్పించుకుంటున్నాడు. దీంతో కోహ్లీకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కొరకరాని కొయ్యగా మారిపోయారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: