గత కొంతకాలం నుంచి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎందుకో స్థాయికి తగ్గట్లుగా లేదు అని విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు ఓపెనర్ గా బరిలోకి దిగి విధ్వంసాన్ని సృష్టించిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ లో భారీ స్కోరు చేయలేకపోతున్నాడు అని అందరూ విమర్శలు గుప్పించడం కూడా మొదలుపెట్టారు. అయితే ఇటీవల కాలంలో రోహిత్ శర్మ బ్యాట్లో మునుపాటి మెరుపులు చూడగలుగుతున్నారు అభిమానులు. సొగసైన షాట్లతో ఎప్పటి లాగానే పాత రోహిత్ శర్మను తలపిస్తుంది అతని బ్యాటింగ్.


 ఇక మైదానంలోకి ఓపెనర్ గా బరిలోకి దిగుతూ మంచి షాట్లతో పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇక మంచి షాట్లు ఆడుతున్న రోహిత్ శర్మ అంతలోనే వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరుతున్నాడు. అయితే ఇక రోహిత్ కు సమవుజ్జి అయిన అతని సహచరుడు కోహ్లీ మాత్రం మునుపడి ఫామ్ అందుకుని సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. దీంతో ఇక వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ బ్యాట్ నుంచి సెంచరీ ఎప్పుడు వస్తుందా అని ఎంతో మంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ఇక అందరికీ చెప్పి మరి సెంచరీ కొట్టాడు రోహిత్ శర్మ.


 ఆందోళన వద్దని.. భారీ స్కోర్ బాకీ ఉందన్న విషయం నాకు తెలుసు అని.. త్వరలోనే శతకం కొడతా అంటూ సరిగ్గా మూడో మ్యాచ్ జరగడానికి రెండు రోజుల ముందు మీడియా సమావేశంలో మాటిచ్చాడు రోహిత్. ఇక ఇచ్చిన మాటను మూడో వన్డే మ్యాచ్లో నిలబెట్టుకున్నాడు అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి అందని ద్రాక్షల రోహిత్ ను వేదిస్తున్న సెంచరీని ఇటీవల అందుకున్నాడు రోహిత్ శర్మ. 2020 లో జనవరి 19న ఆస్ట్రేలియాపై చివరిసారిగా వన్డే ఫార్మాట్లో సెంచరీ ఆడిన రోహిత్ శర్మ మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. 83 బంతుల్లో 100 పరుగులు మార్కులు అందుకున్నాడు.. అయితే ఇలా రోహిత్ చెప్పి మరి సెంచరీ కొట్టడం వల్లే.. హిట్ మ్యాన్ అని బిరుదు సంపాదించాడు అని అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: