గత కొంతకాలం నుంచి వన్డే ఫార్మాట్లో తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న టీమిండియా జట్టు అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్ధులను వణికిస్తుంది అన్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటనకు వెళ్లిన లేకపోతే విదేశీ జట్టు భారత పర్యటనకు వచ్చినా కూడా ఇక టీమిండియా అదే రీతిలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలో కూడా అదిరిపోయే ప్రదర్శనతో సిరీస్లను కైవసం చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్లో అయితే టీమ్ ఇండియా అసాధారణ రీతిలో ఉంది అని చెప్పాలి.


 ఇకపోతే 2023 ఏడాదిని కూడా ఎంతో ఘనంగా ప్రారంభించింది టీం ఇండియా. మొదటి వారం లోనే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో టి20 సిరీస్ ఆడింది. ఈ క్రమంలోనే సిరీస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ లోను ఇదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చేసింది టీమ్ ఇండియా జట్టు. అయితే ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో వరల్డ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్  స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను ఓడించి ఇక ఇప్పుడు అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.


 ఇటీవల న్యూజిలాండ్తో మూడో వన్డే మ్యాచ్లో కూడా విజయం సాధించడం ద్వారా 114 రేటింగ్ పాయింట్స్ సాధించింది టీం ఇండియా. ఈ క్రమంలోనే ఈ పాయింట్ లతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక తర్వాత స్థానాలలో 113 పాయింట్లతో ఇంగ్లాండ్, 112 పాయింట్లు ఆస్ట్రేలియా ఉంది. అయితే మొన్నటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన న్యూజిలాండ్ జట్టు వరుసగా ఓడిపోవడంతో 111 పాయింట్లకు దిగజారి ఇక నాలుగవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి. అయితే న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికా తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసిందంటే ఇక వన్డే ఫార్మాట్లో ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gi