సన్రైజర్స్ ఫ్రాంచైజీ.. గత కొన్ని సీజన్లులో చూసుకుంటే IPLలో ఘోర పరాజయాలు చవి చూస్తూ, ఫ్యాన్స్ తలెత్తుకోలేకుండా చేసిన ఫ్రాంచైజీగా చెడ్డ పేరు మూటకట్టుకొంది. అయితే సౌతాఫ్రికా T20 లీగ్లో మాత్రం యూటర్న్ తీసుకొని అద్భుతమైన ఆటతీరుని ప్రదర్శిస్తూ, వరుస విజయాలతో దూసుకుపోతోంది అనడంలో సందేహమే లేదు. అయితే సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో చవిచూసినా తర్వాత తర్వాత ప్రోటిక్ విజయాలుతో తాజాగా అనగా జనవరి 22న మరో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి అంటే 7 మ్యాచ్లో 4 విజయాలతో 17 పాయింట్లుకి ఎగబాకింది.

ఇక డర్బన్ సూపర్ జెయింట్స్ తో నిన్న జరిగిన మ్యాచ్లో ఆయితే మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.. ఓపెనర్లు ఆడమ్ రాస్సింగ్టన్ 30 బంతుల్లో 72 (10 ఫోర్లు, 4 సిక్సర్లు) కొట్టాడు. జోర్డాన్ హెర్మన్ 44 బంతుల్లో 59 (9 ఫోర్లు, సిక్స్)కొట్టాడు. ఇక అర్థశతకాలతో, కెప్టెన్ మార్క్రమ్ 34 బంతుల్లో 44 నాటౌట్ (3 ఫోర్లు, సిక్స్) కొత్తగా ట్రిస్టన్ స్టబ్స్ 13 బంతుల్లో 27 నాటౌట్ (ఫోర్, 2 సిక్సర్లు)గా నిలిచాడు. దాంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ టీమ్, 86 పరుగులకే కుప్పకూలింది.

ఇందులో సన్రైజర్స్ బౌలర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్ (4-0-20-6) స్పిన్ మాయాజాలం బాగా పనిచేసింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ కైల్ మేయర్స్ (11), వియాన్ ముల్డర్ (29), కేశవ్ మహారాజ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేయడం కొసమెరుపు. సన్రైజర్స్ మిగతా బౌలర్లు అయినటువంటి JJ స్మట్స్, మార్క్రమ్, జన్సెన్, మాసన్ క్రేన్ తలో ఒక వికెట్ పడగొట్టారు. మినీ IPLగా పిలువబడే సౌతాఫ్రికా లీగ్ తొలి సీజన్లో సన్ రైజర్స్ అద్భుత ప్రదర్శన పట్ల సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, IPLల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే SA 20 లీగ్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ ని కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl