KGF సినిమా లో చెప్పినట్టు, తల్లిని మించిన యోధుడు ఈ ప్రపంచం లో ఇంకొకరు వుండరు. తన పిల్లాణ్ణి మోటివేట్ చేయడం లో తల్లే మొదటి గురువు పాత్రను పోషిస్తుంది. అలాంటి కొడుకు ఏదైనా గొప్ప ఘనత సాధిస్తే.. దాన్ని చూసి ఆ తల్లి ఆనందం తో అచ్చెరువవుతుంది. అలాంటి ఓ తల్లి తన కొడుకును పెంచి పెద్దవాడిని చేసి, తనకు నచ్చిన దారిలో వెళ్లమని దగ్గరుండి ప్రోత్సహించింది. కట్ చేస్తే ఆ కుమారుడు సాధించిన ఘనతకి తెగ సంతోషపడిపోతోంది. అతడు మరెవ్వరో కాదు, అథర్వ అంకోలేకర్.

CK నాయుడు ట్రోఫీ లో ముంబైకి సారధ్యం వహిస్తున్న అథర్వ అంకోలేకర్ తాజాగా డబుల్ సెంచరీతో విరుచుకు పడ్డాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అథర్వ 15 ఫోర్లు, 11 సిక్సర్లతో 211 పరుగులు చేసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. మరోవైపు 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో అథర్వ బంతితో విధ్వంసం సృష్టించిన సంగతి అందరికీ విదితమే. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి భారత్‌ను 7వ సారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

ఇకపోతే అథర్వ బంతితో చెడుగుడు ఆడుతున్న సమయం లో అతడి తల్లి, గ్రౌండ్‌లో కాకుండా తన ఉద్యోగం లో నిమగ్నమై ఉండటం గమనార్హం. కొలీగ్స్ ద్వారా తన కొడుకు ఘనతను తెలుసుకుని ఆమె పండగ చేసుకున్నారు. అథర్వ తండ్రి 2010లో చనిపోగా, భర్త కండక్టర్ ఉద్యోగాన్ని భార్య వైదేహి పొందింది. కాగా, ఒకానొక సమయం  లో తన ఆర్ధిక పరిస్థితి కారణంగా అథర్వ క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నాడు. అయితే తల్లి ప్రోత్సాహం తో ప్రతీ రోజూ 15 కి.మీ బస్సులో ప్రయాణించి క్రికెట్ ప్రాక్టీస్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే నేడు అతగాడు అసాధారణ అట ఆడుతున్నాడు. భవిష్యత్తులో కూడా అతగాడు మరింత రాణిస్తాడని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: