సాధారణంగా ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నవారు తమ ఆట గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడరు అని చెప్పాలి. ఇక ఎన్ని రికార్డులు సాధించినప్పటికీ తాము రికార్డులను లెక్క చేయబోము అని చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్లో కూడా అద్భుత ప్రదర్శన చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరికంటే ముందు వరుసలో ఉంటాడు అని చెప్పాలి.


 అయితే ఇక ఎన్నో రోజుల వరకు విరాట్ కోహ్లీ మూడు ఫార్మట్లలో కూడా నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగాడు.  ఇక ఇప్పుడు కూడా టాప్ టెన్ లో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ప్రపంచ క్రికెటర్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు సైతం కోహ్లీ ఆటను అభినందిస్తూ అతను అత్యుత్తమ ఆటగాడు అని పొగుడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు తమ గురించి గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం ఇది ఒప్పుకోవడానికి అసలు ఇష్టపడరు అని చెప్పాలి. ఇక్కడ ఒక పాకిస్తాన్ క్రికెటర్ కూడా ఇక ఇలాంటి వ్యాఖ్యలతో ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ విరాట్ కోహ్లీ కాదు నేనే అంటూ గొప్పలకు పోయాడు సదరు పాకిస్తాన్ క్రికెటర్.


 తానే ప్రపంచ నెంబర్ వన్ క్రికెటర్ ను అని.. తన తర్వాతే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ అందరిని ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ ప్లేయర్ ఖుర్రుమ్ మన్సూర్. విరాట్ కోహ్లీ తో పోల్చుకోవడం లేదు. కానీ 50 ఓవర్ల ఫార్మాట్లో మాత్రం నేనే నెంబర్ వన్ ఆటగాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నా తర్వాతే విరాట్ కోహ్లీ. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రతి ఆరు ఇన్నింగ్స్ లకు ఒక సెంచరీ చేస్తాడు. నేను 5.68 ఇన్నింగ్స్ లకే సెంచరీ చేశాను. ఇది ప్రపంచ రికార్డు. పదేళ్లుగా నా యావరేజ్ 53 గా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు  మన్సూర్. అయితే 2016 తర్వాత ఇతనికి పాకిస్తాన్ జాతీయ జట్టులో చోటు లేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: