ఇక రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మొదట బౌలింగ్‌ విభాగం ఇంకా ఆ తర్వాత బ్యాటింగ్‌లో చాలా దారుణంగా నిరాశపర్చిన టీమిండియా ఏకంగా 21పరుగుల తేడాతో చాలా దారుణంగా పరాజయం పాలైంది.కాగా తన సొంత ఊరిలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఎం ఎస్ ధోని హాజరయ్యాడు. తన భార్య సాక్షి సింగ్‌తో కలిసి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూశాడు ధోని. ఇక మ్యాచ్‌ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని స్క్రీన్‌పై కనబడగానే స్టేడియం మొత్తం కూడా ధోని.. ధోని అంటూ నినాదాలతో స్టేడియం ని హోరెత్తించారు. ఈక్రమంలో ధోనీ ధోనీ అంటూ అభిమానులు నినదిస్తుండగా ధోని కూడా స్పందించాడు. చిరునవ్వు చిందిస్తూ చేతులు ఊపుతూ అందరికీ కూడా అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఆటగాళ్ల ఆటని చూడటానికి రాంచీకి వచ్చి ఎంఎస్ ధోని ఆకస్మికంగా స్టేడియంను సందర్శించాడు ధోని.


తరువాత టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లతో సరదాగా మాట్లాడారు. కెప్టెన్ హార్దిక్, ఇషాన్ కిషన్, శివమ్ మావి ఇంకా అలాగే వాషింగ్టన్ సుందర్ లతో కలిసి చాలాసేపు ధోని గడిపాడు. ఇక రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం ఎం ఎస్ ధోనీకి హోమ్ గ్రౌండ్. ఆయన తరచుగా ఇక్కడే బ్యాటింగ్ ప్రాక్టీస్‌ చేస్తాడు.ఇంకా అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ధోనీ 16వ ఎడిషన్ కోసం ఇప్పుడు కసరత్తులు ప్రారంభించాడు.ఇక శుక్రవారం నాడు జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో డెవాన్ కాన్వే (52) ఇంకా డెరల్ మిచెల్ (59) హాఫ్ సెంచరీల సాయంతో న్యూజిలాండ్ ఏకంగా 176 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ 35 ఇంకా గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు చేశారు. ఇండియా తరఫున వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఇంకా శివమ్ ఒక్కొక్క వికెట్ తీశారు. మొత్తం 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇక వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21) అలాగే సూర్యకుమార్ యాదవ్ (47) ఆశలు రేకెత్తించినా కూడా టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. ఇక ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం 28 బంతుల్లో 50 పరుగులు చేసి బాగానే ఆడినా ఇతర బ్యాటర్లు అతనికి సహకారం ఇవ్వలేదు. చివరికి ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఇక ఈ మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా 0-1తో వెనుకంజలో ఉంది.ఇక రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ ఆదివారం నాడు (జనవరి 29) జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: