గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అటు జట్టులో సీనియర్ ప్రేయర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీలు టి20 ఫార్మాట్లో కనిపించడం లేదు అని చెప్పాలి. ఈ ఇద్దరు ప్లేయర్లను పక్కనపెట్టి ఇక హార్థిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఇక వరల్డ్ కప్ తర్వాత ఇప్పటివరకు టీమిండియా ఆడిన ప్రతి టి20 సిరీస్ లో కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే బరిలోకి దిగింది. అదే సమయంలో ఇక యువ ఆటగాళ్లకు చోటు ఇచ్చి కొత్త టీం ను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2024 లో జరగబోయే టి20 వరల్డ్ కప్ లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.


 ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ అటుభారత జట్టులో అత్యుత్తమ ప్లేయర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులో కనిపించకపోవడంతో అభిమానులందరూ నిరాశలో మునిగిపోతున్నారు. ఇక ఇద్దరు సీనియర్ ప్లేయర్ల టి20 కెరియర్ ముగిసినట్లేనా అని అయోమయంలో ఉన్నారు. ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఈ విషయంపై మాట్లాడిన పాకిస్తాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ స్థానాన్ని ప్రత్యామ్నయా ఆటగాడితో భర్తీ చేయవచ్చు.. కానీ విరాట్ కోహ్లీ రోహిత్ లాంటి ఆటగాళ్లను రీప్లేస్మెంట్ చేయడం కష్టం. జట్టులోకి వచ్చిన గిల్, పృథ్విషా,  ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు మంచి ఆటగాళ్ళు.  భవిష్యత్తులో స్టార్ ప్లేయర్ల స్థానానికి ఎదగగలరు. అయితే వీరంతా ఒకే తరహా ఆటగాళ్లు. ఒకే అనుభవం ఉంది ఆటపరంగా అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నా  అనుభవం లేమి అడ్డంకిగా అవకాశం ఉంది. న్యూజిలాండ్తో జరిగిన తొలి టి20 లో జట్టులో సీనియర్లు లేని లేటెస్ట్ స్పష్టంగా కనిపించింది. అందుకే రోహిత్ కోహ్లీలలో ఒక్కరినైనా సరే జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు రషీద్ లతీఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: