గత కొన్ని రోజుల నుంచి టీమిండియాలో అవకాశాలు దక్కించుకున్న యువ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అదరగొడుతూ ఉంటే.. ఇప్పటికే టీమ్ ఇండియాలో అత్యుత్తమ ప్లేయర్లుగా నిరూపించుకొని సీనియర్లుగా కొనసాగుతున్న వారు మాత్రం పేలవ  ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నారు. ఇలా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్ళలో చాహల్ కూడా ఒకరు అని చెప్పాలి. ఏకంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ప్రపంచ స్థాయికి స్పిన్నర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో టీమ్ ఇండియా విషయంలో కీలక పాత్ర వహించాడు.


 కానీ గత కొంతకాలం నుంచి మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అదే సమయంలో చాలా రోజుల నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి వచ్చిన అతని సహచరుడు కుల్దీప్ యాదవ్ మాత్రం తన స్పిన్ మాయాజాలంతో అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ తో జరిగిన ఆరు మ్యాచ్లలో కూడా కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే ఆడాడు చాహల్. దీంతో అతని ఫామ్ గురించి విమర్శలు కూడా వస్తున్నాయని చెప్పాలి. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 సుదీర్ఘ కెరియర్ లో ప్రతి బౌలర్ కి గడ్డు పరిస్థితులు తప్పవు. ఇక ప్రస్తుతం చాహాల్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇక మిడిల్ లో చాహల్ లాంటి బౌలర్లను గేమ్ టైం దొరకకపోతే.. బహుశా దేశవాళీ క్రికెట్లో అయినా ఆడతారా అని జట్టు మేనేజ్మెంట్ అడగాలి.. ఎందుకంటే ఈ సమయం తిరిగి మళ్లీ ఫామ్ లోకి రావడానికి ఉపయోగపడుతుంది. చాహాల్ కు అదే మంచి ప్రిపరేషన్. నేను ఈరోజు బాగా ఆడాను. కొంచెం రిలాక్స్ అవుతాను అనుకోవచ్చు. కానీ ఆ సమయమే మీపై ఒత్తిడిని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ విషయంపై చాలా ఫోకస్ పెట్టాలి. అలా చేస్తేనే భారత జట్టులో అతని స్థానం సుస్థిరమవుతుంది అంటూ సునీల్ జోషి చెప్పుకొచ్చాడు. అతను బంతిని పుష్ చేయడం వల్ల దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు జోషి.

మరింత సమాచారం తెలుసుకోండి: