సాధారణంగానే క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే క్రికెటర్లకు సంబంధించిన ఏ పోస్ట్ బయటికి వచ్చిన అది నిమిషాల్లో ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటుంది. అలాంటిది ఇంకా కొన్నేళ్ల పాటు ఇక అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగి అభిమానులను అలరిస్తాడు అన్న ఆటగాడు ఉన్నఫలంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇక ఆ వార్త సోషల్ మీడియాను ఊపేస్తూ ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వరకు ఎంతో మంది స్టార్ క్రికెటర్లు సైతం ఇలాంటి ట్విస్టులు ఇచ్చి అభిమానులను షాక్ లో ముంచేశారు.


 ఇక ఇలా వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఊహించని షాకులు ఇస్తున్న ఆటగాళ్లలో ఆస్ట్రేలియా టి20 జట్టు కెప్టెన్ గా ఉన్న ఆరోన్ ఫించ్ కూడా ఒకరు అని చెప్పాలి. గతంలో వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ కి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం కేవలం టి20 ఫార్మాట్లో మాత్రమే ఆస్ట్రేలియా  జట్టు కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా టి20 కెప్టెన్ గా అయినా సరే ఇంకా కొన్నేళ్లపాటు కొనసాగుతాడని అభిమానులు భావించినప్పటికీ.. ఇక ఇప్పుడు మరోసారి ట్విస్ట్ ఇచ్చాడు అరోన్ ఫించ్.


 తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన చేశాడు. 2024 టీ20 ప్రపంచ కప్ వరకు నేను ఆడకపోవచ్చు అన్న విషయం నాకు అర్థమైంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇది సరైన సమయం అని నేను భావిస్తూ ఉన్నాను. ఇక ఇన్నాళ్ళ నా కెరియర్ లో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు. కాగా అరోన్ ఫించ్ అతని కెరియర్ లో 103 టీ20 మ్యాచ్ లు, 146 వన్డే మ్యాచ్ లు,, 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 76 టీ20 లు 55 వన్డే మ్యాచ్ లలో ఇక ఆస్ట్రేలియా జట్టుకు సారధ్య బాధ్యతలు వహించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: