దేశం మొత్తం మీద ఇటువంటి విచిత్రమైన ప్రతిపక్ష నేత ఇంకే రాష్ట్రంలో కూడా ఉండడేమో . పక్క రాష్ట్రమైన తెలంగాణా కూర్చుని ఏపి రాజకీయాలను కంపు చేయటం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ  చంద్రబాబునాయుడుకి బాగా అలవాటైపోయింది. గతంలో కూడా ఇలాగే చేసినా  తాజాగా కరోనా వైరస్ సంక్షోభంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేయటం మరీ చవకబారుగా అయిపోయింది.  వైరస్ నియంత్రణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవటం లేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఏపిలో ఇన్ని కేసులు పెరిగేవి కావంటూ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు.

 

ఇక్కడ విచిత్రమేమిటంటే తెలంగాణాలో కూర్చుని ఏపిలో జగన్ ప్రభుత్వంపై బురద చల్లేస్తుండటం. ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం, ట్వీట్లతో జగన్ పై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు.  పక్క రాష్ట్రంలో కూర్చుని సొంత రాష్ట్రంపై బురద చల్లే   నేతను దేశం మొత్తం మీద మీరు ఇంకెక్కడైనా చూశారా చంద్రబాబు కాకుండా ? నిజంగా చంద్రబాబు తన విజయవాడకు సమీపంలోని అక్రమ కట్టడంలోకి రావాలంటే పెద్ద అభ్యంతరాలు ఉండవు. కానీ వైరస్ కు భయపడే విజయవాడలో ఉండాల్సిన చంద్రబాబు కొడుకుతో కలిసి హైదరాబాద్ లో  కూర్చున్నాడు.

నిజానికి వైరస్ నియంత్రణ విషయంలో జగన్ గట్టి చర్యలే తీసుకున్నాడు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, తమిళనాడు, కర్నాటకతో పోల్చినపుడు ఏపిలో బాధితులైనా, చనిపోయిన వారి సంఖ్య అయినా తక్కువగానే ఉందంటే అర్ధం ఏమిటి ?  కాకపోతే ఢిల్లీలో ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారి కారణంగానే బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఢిల్లీలో ప్రార్ధనల కారణంతోనే 17 రాష్ట్రాల్లో బాధితులు పెరిగిపోయారు. ఇందులో ఏమన్నా తప్పుంటే అది కేంద్రానిదే. కాబట్టి ఈ విషయంలో జగన్ చేయగలిగేదేమీ లేదు. 

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వైరస్ నియంత్రణ విషయంలో జగన్ తీసుకుంటున్న చర్యలను బయట రాష్ట్రాలతో పాటు ప్రధానమంత్రి, విదేశాలు కూడా మెచ్చుకుంటున్నాయి. ఇంతమంది జగన్ ను మెచ్చుకోవటాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నారు. అసలే జగన్ అంటే చంద్రబాబుకు బాగా మంట. దానికితోడు అందరు మెచ్చుకోవటాన్ని సహించలేక తనవంతుగా బురద చల్లేస్తున్నాడు. ఎలాగూ తాను ఏమి చెబితే అలా నడుచుకునే మీడియా ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ వార్తలు, కథనాలు అచ్చేయిస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: