ప్ర‌పంచాన్ని వ‌ణికించేస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి మ‌న భార‌తదేశాన్ని కూడా అత‌లాకుత‌లం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌రోనా ప్ర‌భావం రెండు తెలుగు రాష్ట్రాల‌పై ప‌డింది. తెలంగాణ‌లో కంటే ఏపీలో ప‌రిస్థితులు ముందు కాస్త బాగానే ఉన్నా ఆ త‌ర్వాత మ‌ర్క‌జ్ బాధితుల నేప‌థ్యంలో ఒక్క‌సారిగా కేసులు వీర‌విహారం చేస్తున్నాయి. ఏపీలో ఇప్ప‌టికే క‌రోనా బాధితులు న‌లుగురు మృతి చెంద‌గా ఈ కేసులు 329 వ‌ర‌కు వెళ్లాయి. ఏపీ ప్ర‌భుత్వం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా మ‌ర్క‌జ్ కు వెళ్లి వ‌చ్చిన వారి వల్లే బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

 

అయితే ఈ టైంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉంటే ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో ? అని టీడీపీ వాళ్లు.. బాబోరి వీరాభిమానులు ఓ మెసేజ్‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూ ఆనందం పొందుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబును. టీడీపీ వాళ్ల‌ను మీడియా వాళ్లే కాదు... టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే వాళ్లు ఓ మెసేజ్ వైర‌ల్ చేసుకుంటూ ఆనందం పొందుతున్నారు. ఆ మెసేజ్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

ఎక్కడ్రా... బాబోయ్! 

నువ్వంటే నాకు పెద్ద లవ్వేం లేదు
షాట్ కొట్టాల్సిన చోట డిఫెన్స్ ఆడతావనీ,
సెంచరీ చేసి పాతుకుపోవాల్సినప్పుడు వికెట్ పారేసుకుంటావని కోపం తప్ప!
నువ్ పదే పదే కనపడినప్పుడు, మాట్లాడుతున్నప్పుడూ అనుకునేవాణ్ని...
పరిగెత్తేది గుర్రాలు అయితే నువ్వెందుకు ఆయాస పడతావ్ అని!
ఇప్పుడు చాలా గుర్రాలు అవే!
పైగా కొన్ని ఇంపోర్టెడ్
వేటికీ కళ్లకి గంతల్లేవ్...
ఇష్టానుసారం ఏదైనా చేయొచ్చు
కానీ చేయడం లేదేం?
అంటే చెప్పే దిక్కు లేకనేనా?
నువ్ అప్పట్లో ఆత్రపడింది ఇందుకేనా ?
అర్థమవుతోంది నాకు!

 

హరికేన్ లాంటి హుదూద్ విరుచుకు పడి వాషౌట్ చేసింది!
అయినా... షవర్ బాత్ చేసి వచ్చినంత ఫ్రెష్ గా వారం రోజుల్లో తేరుకుంది విశాఖ!
జపాన్ చూడని వింత ఇది!
అమెరికా తీరానికి తెలియని స్పీడు అది!
పైగా ఆర్నెల్లు తిరిగే లోపు బెస్ట్ సిటీగా నేషనల్ అవార్డు కూడానూ!
అమ్మణమ్మ కొడకా...
నువ్ పనిగాడివిరా... మొనగాడా!

 

దాని పేరు కరోనా !
కర్ నే కేలియే... కుఛ్ నహీ అంటోంది ఏపీ!
ఎటు చూసినా అన్ హ్యాపీ!
వెనకబడ్డాం వెనకబడ్డాం అని 
పది నెలలుగా మొత్తుకుంటున్నందుకో ఏమో...
దేశంలోనే టాప్ కి వెళ్లిపోతోంది ఏపీ!
కరోనా కేసుల్లో! 
భయం వేస్తోంది నాకు!
నువ్ ఉంటే ఇలా ఉండేది కాదని అర్థం అవుతోంది నాకు!

 

చైనాలో వచ్చినపుడే నువ్వైతే అప్రమత్తం అయ్యేవాడివి కాదా?
విదేశాల్లో ఉన్న పిల్లల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఊరుకుంటావా?
పిల్లల్ని వెనక్కి పిలవండి... మళ్లీ పంపుదామని మోతెక్కేవాడివి కాదా?
అక్షయపాత్రలతో భోజనాలు పెట్టించి...
డ్వాక్రా మహిళలతో మాస్కులు కట్టించి...
మద్యం డిస్టలరీస్ తో శానిటైజర్లు చేయించి...
రాబోయేది సంక్షోభం... నేను సిద్ధం... మీరు రెడీయేనా అంటూ పొడిపొడి ఇంగ్లిష్ లో దేశం మొత్తాన్నీ నిద్ర లేపేవాడివి కాదా ?

 

వందల కేసులు వచ్చాక ఐసోలేషన్ వార్డులు వెదికేవాడివా నువ్?
నా స్టేటు వైరస్ ని ఇలా ఆపుతోందని ఆన్ లైన్ డెమో పెట్టి ప్రపంచం కళ్లు తెరిపించేవాడివి కాదా?
సందేశాల వీడియో రికార్డింగులు చేసుకుంటూ పొద్దుపుచ్చేవాడివా? 
ఆరోగ్యం ఇలా... ఆర్థికం కోసం అలా ... అంటూ దేశానికి దారి చూపేవాడివి కాదా?
అయినా నా పిచ్చి గానీ...
నీకు కాఫీ తీసుకొచ్చే రాము గాడు కూడా పారాసిటమాల్ మాట మాట్లాడేవాడు కాదేమో!
డిసిప్లీన్ లేకపోతే మేడంకి నచ్చదని!
మొత్తానికి ఇప్పుడు మేం ఎక్కడ ఉన్నామో 
అర్థం అవుతోంది నాకు!

 

కరోనా లాంటివి వచ్చినపుడు
ఆలోచన ఉన్నోడు కావాలి!
కందిపప్పు కొట్టేసేవాడు కాదు!
వైరస్ ని తట్టుకోవాలంటే వ్యూహం ఉండాలి...
రంగులేసే టాలెంట్ సరిపోదు!
ప్రపంచం మొత్తం రేపు మునుగుతోంది
నేను ఇవాళే ముంచుతా అనేవాడెందుకు?
సంక్షోభాన్ని చక్కదిద్దే మొనగాడు కదా కావాల్సింది!
నువ్ చెప్పిన 49 రోజుల లాక్ డౌన్ ది బెస్ట్ అని దేశం అంటుంటే...
5 వేల సాయం మినిమం అని మిగతా రాష్ట్రాలు వింటుంటే...
మళ్లీ ఇంకోసారి 
అర్థం అవుతోంది నాకు ! 

 

నువ్ కట్టినవి కూల్చేందుకు...
నువ్ పెట్టినవి ఆపేందుకు...
కోరికోరి కొరివి పెట్టుకున్నాం!
అలా మూసేసిన మెడ్ టెక్ తెరిస్తే తప్ప ఇప్పుడు దిక్కులేదు !
నీ దారే రైటని తెలిసి...
నీ మాటే లైటయి వెలిగి...
నువ్వొచ్చే రోజు రాక ఎక్కడికిపోద్ది!
అర్థం అవుతోంది నాకు!

 

మరింత సమాచారం తెలుసుకోండి: