ఇపుడిదే అంశంపై  రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఫోన్ చేసి చంద్రబాబునాయుడుతో మాట్లాడటం కూడా రాజకీయాంశం ఎలాగయ్యింది ? ఎలగంటే అందుకు చంద్రబాబే కారణం. గడచిన రెండేళ్ళుగా చంద్రబాబును ప్రధానమంత్రి పూర్తిగా దూరం పెట్టేసిన విషయం అందరికీ తెలిసిందే.  తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుని మోడిపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు చివరకు చతికలపడ్డాడు. దాంతో తత్వం బోధపడి మళ్ళీ ప్రధానికి దగ్గరవుదామని ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు.

 

ఈ నేపధ్యంలోనే  మోడి తనకు ఫోన్ చేసినట్లు చంద్రబాబు చెప్పగానే రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైపోయింది. ఇదే విషయమై వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్లో చంద్రబాబు గాలితీసేశాడు. ’ప్రధాని నాకు ఫోన్ చేసి సలహాలడిగాడు’ ... ఇది నరేంద్రమోడి ఫోన్ చేసిన విషయమై చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా చేసేకుంటున్న ప్రచారం.  ’పాతికసార్లు ప్రాధయేపడితే ప్రధానమంత్రి నరేంద్రమోడి కాల్ చేసుంటాడు’ అని విజయసాయి ఎద్దేవా చేశాడు. పారిశుధ్య కార్మికులు, నర్సింగ్ సిస్టర్లు, కరోనా వైరస్ సమస్యతో కోలుకున్న వాళ్ళతో కూడా మోడి మాట్లాడిన విషయాన్ని ఎంపి గుర్తుచేశాడు.

 

మోడి గురించి మాట్లాడుతూ ప్రతిరోజు ప్రధాని ఎందరికో ఫోన్లు చేసి పరామర్శిస్తుంటారని, యోగక్షేమాలు కనుక్కుంటున్నారంటే దాన్ని ప్రధాని వినమత్రగా గుర్తుచేశాడు. దాన్ని కూడా చంద్రబాబు రాజకీయంగా ప్రచారానికి వాడుకోవటం చూస్తుంటే తనకు నవ్వు వస్తోందన్నాడు. ఏం మొహం పెట్టుకుని ఏపికి వస్తాడని నిలదీసి మోడి గో బ్యాక్ అంటూ ఫ్లీక్సీలు కట్టించిన విషయాన్ని మోడి ఎలా మరచిపోతాడంటూ విజయసాయి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని నిలదీశాడు.

మోడి జ్ఞాపకశక్తి అపరామని గతంలో  చేసిన అవమానాలను మోడి మరచిపోయుంటాడని చంద్రబాబు అనుకుంటున్నాడు అని ఎంపి చరిత్రను ఓసారి గుర్తుచేశాడు. చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం మోడికి ఏముంది ? అనే అర్ధం వచ్చేట్లుగా విజయసాయి మండిపడ్డాడు. అందుకనే పాతికసార్లు ఫోన్ చేసి బతిమలాడుకుంటే పోనీలే అని మోడి ఫోన్ చేసుంటాడు అని ప్రధాని ఫోన్ చేయటంపై విజయసాయి క్లారిటి ఇచ్చాడు.

 

మొత్తానికి తన తాజా ట్వీట్ తో వైసిపి ఎంపి చంద్రబాబు గాలి తీసేశాడనే చెప్పాలి. చంద్రబాబు, టిడిపి నేతల ఆరోపణలు, విమర్శలపై విజయసాయి రెగ్యులర్ గా తన ట్వీట్లతో చెండాడేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైసిపి తరపున ప్రతిపక్ష నేతలపై బాగా స్పీడుగా ఉండే వైసిపి నేతల్లో విజయసాయే ముందుంటారనటంలో సందేహం లేదు.

 

అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన విషయంలో కూడా ప్రభుత్వానికి కోర్టు ఫుల్లుగా క్లాసు పీకింది. విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబునాయుడును అడ్డుకున్న విషయంలో కూడా కోర్టు నుండి ప్రభుత్వం చివాట్లు తిన్నది. అందుకనే ఏదేనా నిర్ణయం తీసుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే ప్రతి నిర్ణయం కోర్టులో వీగిపోవటం ఖాయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: