తండ్రి కొడుకులు చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ను వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి దుమ్ము దులిపేశాడు. ట్విట్టర్ వేదికగా ఇద్దరినీ ఎంపి చెడుగుడు ఆడేశాడనే చెప్పాలి. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాళ్ళకు సొంత రాష్ట్రాలకు వెళ్ళేందుకు అవకాశం దొరికింది కానీ చంద్రబాబు, లోకేష్ కు మాత్రం మనసు రావటం లేదంటూ ఎద్దేవా చేశాడు. కరోనా వైరస్ వచ్చిన దగ్గర నుండి తండ్రి, కొడుకులిద్దరూ అమరావతి కరకట్ట మీద అక్రమనివాసాన్ని వదిలేసి హైదరాబాద్ లో కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇదే విషయమై వైసిపి మంత్రులు, సీనియర్ నేతలు రెగ్యులర్ గా చంద్రబాబును, చినబాబును వాయించేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఎందుకంటే ఇద్దరు హైదరాబాద్ లో కూర్చుని ఏపిలో జగన్ పరిపాలన సరిగ్గా లేదని, కరోనా వైరస్ నియంత్రణలో జగన్ ఫెయిలయ్యాడంటూ రోజు ట్విట్టర్ లో ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అయితే ప్రెస్ మీట్లు పెట్టి తరచూ విమర్శిస్తున్నాడు. వైరస్ నియంత్రణకు జగన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నా వీళ్ళు మాత్రం రాళ్ళేస్తునే ఉన్నారు.

అందుకనే అవకాశం దొరికిచ్చుకుని మరీ వైసిపి వాళ్ళు ఇద్దరినీ వాయించేస్తుంటారు. విజయసాయి ట్విట్టర్లో అందుకు రెచ్చిపోతుంటాడు. ప్రవాసంలో ఉన్న తుప్పు, పప్పులకు ఇదే చక్కని అవకాశం అని అన్నాడు ఎంపి. ఇక లాక్ డౌన్ అంటూ సాకులు చెప్పి హైదరాబాద్ లో కూర్చునే అవకాశం కూడా లేదట ఇద్దరికీ. ఇపుడు రాకపోతే వ్యాక్సిన్ వచ్చే వరకూ శాస్వతంగా హైదరాబాద్ లోనే కూర్చోవాల్సొస్తుంది మీ ఇష్టం అంటూ మండిపడ్డాడు. విజయసాయి ట్వీట్ లో ఒకవైపు వీళ్ళను ఎద్దేవా చేస్తున్నట్లుంటూనే మరోవైపు హెచ్చరించినట్లుండటం గమనార్హం.

 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రాళ్ళేయటం వీళ్ళద్దరికీ బాగా అలవాటైపోయింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి బాగా తెలిసి కూడా పేదలకు తలా పది వేల రూపాయలు పంపిణీ చేయాలని డిమాండ్ చేయటం వీళ్ళకే చెల్లింది. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వం చేస్తున్నది సరిపోదని ఇంకా చేయాలంటూ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నపుడు పేదల గురించి ఆలోచించిందే లేదు. అధికారంలో ఉన్నపుడు వాళ్ళు చేయాల్సిన పనులన్నింటినీ ఇపుడు  జగన్ చేయాలంటూ డిమాండ్లు చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

 

చంద్రబాబు విపరీతమైన ధోరణి వల్లే ప్రతిరోజు మీడియాలో వైసిపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.  చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కూడా రంగంలోకి దిగటంతో వీళ్ళంతా ఒకవైపు జగన్ ఒక్కడ ఒకవైపు అనే భావన జనాల్లో వచ్చేసింది. మరి అంతిమంగా జనాలు ఎటువైపు అన్నదే తేలాలి. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: