ఇటు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో పాటు అటు మొత్తం టిడిపి నేతలను వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ఓ రేంజిలో ఆడుకుంటున్నాడు. ప్రతిరోజు తనదైన స్టైల్లో ట్విట్టర్ వేదికగా చెలేరేగిపోతున్నాడు. చంద్రబాబు, చినబాబు అండ్ కో  ట్విట్టర్ వేదికగా చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు విజయసాయి కూడా ట్విట్టర్ వేదికగానే సమాధానం ఇస్తున్నాడు. తాజాగా ఈ క్రింది వారిలో ’కరోనా రత్న’  ఎవరు ? అంటూ ఐదుగురి పేర్లను ఇవ్వటం హైలైట్ గా నిలిచింది.

 

ట్విట్టర్లో ఎంపి ఇచ్చిన ఐదుపేర్లు కూడా నేతల అసలు పేర్లు కావు. వాళ్ళ పేర్లను పోలిన విచిత్రమైన పదజాలంతో జాబితాను ఇచ్చాడు. ఆ పేర్లు చదవిని ఎవరికైనా అసలు పేర్లు వెంటనే స్పురించేట్లుగానే జాబితాను జాగ్రత్తగా సెట్ చేశాడు. ఇంతకీ విజయసాయి చెప్పిన ఆ ఐదుపేర్లు ఏమిటి ? ఏమిటంటే మొదటి పేరు  పెదనాయుడు. రెండోపేరు  చిననాయుడు. మూడోపేరు మలమలకృష్ణరాముడు,  నాలుగోది దయనేని రమ కాగా ఐదోపేరు భజన చౌ.

పైగా క్విజులో చెప్పినట్లుగా 24 గంటల్లో మీ అభిప్రాయాలను చెప్పండని కూడా ఎంపి ట్విట్టర్లో కోరటం గమనార్హం. నిజానికి వైసిపి నేతలందరిలోకి మొదటి నుండి ట్విట్టర్ వేదికగా బాగా యాక్టివ్ గా ఉంటున్నది విజయసాయి మాత్రమే అని కొత్తగా చెప్పనక్కర్లేదు. వైసిపి పార్టీ తరపున కూడా ట్విట్టర్లో కొందరు యాక్టివ్ గా ఉంటున్నా విజయసాయి మాత్రం తన సొంత ఖాతా ద్వారానే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాను కూడా ఉతికి ఆరేస్తుంటాడు.

 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు జనాలు, అభిమానులతో పంచుకుంటున్నాడు. అదే సమయంలో  జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వంపై చంద్రబాబు అండ్ కో చేస్తున్న  ఆరోపణలు, విమర్శలను తిప్పి కొడుతున్నాడు.  మొత్తానికి వైసిపి, ప్రభుత్వం తరపున ప్రత్యర్ధులపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్న అధికార పార్టీ నేతగా ఒక్క విజయసాయిని మాత్రమే చెప్పుకోవాలి.

 

వైసిపి ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా ట్విట్టర్లో చాలా యాక్టివ్ గానే ఉండేవాడు. అప్పట్లో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అభిమానులను చంద్రబాబు, లోకేష్ చాలామందిపై కేసులు పెట్టించి అరెస్టులు చేయించింది. వాళ్ళని విడిపించటంలోను, కోర్టులో కేసులపై పోరాటం చేయటంలోను విజయసాయి చాలా యాక్టివ్ గా ఉండేవాడు. పార్టీ తరపున మొత్తం సోషల్ మీడియా వ్యవహారాల్లో ఎంపినే కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేస్తాడా ?  మొత్తానికి విజయసాయి చెప్పిన ఐదు పేర్లకు సంబంధించిన అసలు పేర్లేవో  మీకేమైనా తెలుసా ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: