ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడును నమ్ముకుంటే చిరవకు తే సంగతులా ?  మత్తు డాక్టర్ సుధాకర్ కు పట్టిన గతేనా ? ఇపుడిదే అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతోంది. దానికితోడు వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి కూడా సోషల్ మీడియాలో ఇదే విధమైన చర్చ జరుగుతోందని చెప్పటం గమనార్హం. చంద్రబాబును నమ్ముకుని పాపం మత్తు డాక్టర్ సుధాకర్ చివరకు మెంటల్ ఆసుపత్రి పాలైనట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారంటూ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో ఎద్దేవా చేశాడు.

 

సరే విజయసాయి చెప్పాడని కాదుకానీ చాలామందిలో ఇదే విధమైన అభిప్రాయముంది. దాదాపు నెలన్నర క్రితం కరోనా వైరస్ వైద్యానికి మాస్కులు లేవని, పిపిఇ కిట్లు లేవంటూ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు బహిరంగంగా మాట్లాడినందుకు సస్పెండ్ అయ్యాడు. అసలు డాక్టర్ ప్రభుత్వంపై ఎందుకు నోటికొచ్చినట్లు మాట్లాడినట్లు ? ఎందుకంటే టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి పుణ్యమే అని తేలింది. చింతకాయలతో మాట్లాడిన తర్వాతే డాక్టర్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు విరుచుకుపడ్డాడని తేలిపోయింది.

 

అంటే చింతకాయల ప్రోద్భలంతోనే డాక్టర్ మాట్లాడాడని అర్ధమైపోయింది. ఎప్పుడైతే విషయం బయటపడిందో వెంటనే డాక్టర్ మాట్లాడుతూ తాను ప్రభుత్వంపై నోరుపారేసుకోవటం తప్పే అని ఒప్పేసుకున్నాడు. సరే ఆ విషయం తర్వాత మరుగున పడిపోయింది. అయితే హఠాత్తుగా అదే డాక్టర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా రోడ్డు మీద వీరంగం వేస్తు కనిపించాడు. ఓ రోడ్డు మీద కారును ఆపేసి మద్యం మత్తులో రోడ్డుపై వచ్చే పోయే వాళ్ళని నోటికొచ్చినట్లు తిడుతూ గోల చేస్తున్నాడంటూ స్ధానికులు ఫిర్యాదు చేశారు.

వెంటనే పోలీసులు సీన్ దగ్గరకు చేరుకుని డాక్టర్ ను అదుపులోకి తీసుకుని ముందు ఆసుపత్రికి తర్వాత అక్కడి నుండి  మెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ను పరీక్షించిన మెంటల్ డాక్టర్లు సుధాకర్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేల్చారు.  రోడ్డు మీద సుధాకర్ ప్రవర్తన చూసిన వాళ్ళకు ఎవరికైనా అనుమానం వస్తుంది. అసలు ఇన్ని రోజులు కామ్ గా ఉన్న సుధాకర్ హఠాత్తుగా ఎందుకు మళ్ళీ రోడ్లపైకి వచ్చాడు ? అన్నదే అసలైన ప్రశ్న. ఇక్కడే అందరికీ చంద్రబాబు మీద అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

తాజాగా జరిగిన గొడవ వెనకాల కూడా చంద్రబాబు, టిడిపి నేతల ప్రోద్బలం ఉందేమో అనే అనుమానాలున్నాయి. ఎందుకంటే జగన్ ను నోటికొచ్చినట్లు తిట్టిన డాక్టర్ పనిలో పనిగా పోలీసులను కూడా జాతరలో తిట్టినట్లుగా బూతులు తిట్టేశాడు. అంటే డాక్టర్ తో రోడ్డు మీద పిచ్చి చేష్టలు చేయించి అరెస్టులు, మెంటల్ ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత దాన్ని రాజకీయంగా జగన్ పై బురద చల్లేట్లుగా చంద్రబాబు అండ్ కో ముందుగానే ప్లాన్ చేశానిట్లే అనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో ప్రత్యర్ధులపై బురద చల్లాలంటే ఎంత నీచానికైనా దిగజారిపోతారన్న విషయం గతంలో చాలా సార్లు రుజువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: