చంద్రబాబునాయుడును నమ్ముకుని రాజకీయాలు చేస్తే ఏమవుతుందో తాజాగా మత్తు డాక్టర్ సుధాకర్ విషయం మరోసారి రుజువైంది. ఇంతకాలం డాక్టర్ విషయంలో ప్రభుత్వం ఏమైతే చెబుతోందో సిబిఐ ఇపుడు దాదాపుగా అదే చెప్పింది.  డాక్టర్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. నర్సీపట్నంలో పనిచేస్తున్న మత్తు డాక్టర్ కరోనా వైరస్ నేపధ్యంలో మాస్కులు, పిపిఇ కిట్లు ఇవ్వటం లేదంటూ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించిన విషయం అందరికీ తెలిసిందే. సర్వీసు రూల్సు అతిక్రమించి ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు డాక్టర్ సస్పెండ్ అయ్యారు. మామూలుగా ఎవరైనా సస్పెండ్ అయితే తమపై అధికారులతో మాట్లాడుకుని ఏదో ఓ పద్దతిలో సస్పెన్షన్ను ఎత్తేయించుకునేందుకు ప్రయత్నిస్తారు.

 

కానీ డాక్టర్ మాత్రం కొద్ది రోజులు మౌనంగా ఉండి ఒకరోజు హఠాత్తుగా వైజాగ్ బాలయ్యశాస్త్రి లే అవుట్ లో ప్రత్యక్షమయ్యాడు. సరే ట్రాఫిక్కుకు అంతరాయం కలిగించటం, జనాలు 100కు డయల్ చేయటం, పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకోవటం అందరికీ తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో బాగా వైరల్ అయిపోయింది.  ఎప్పుడైతే విషయం వెలుగు చూసిందో చంద్రబాబుతో పాటు టిడిపి నేతలందరు రంగంలోకి దిగేశారు. వెంటనే ఎల్లోమీడియా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు మొదలుపెట్టేసింది.

 

రోడ్డు మీద జరిగిన ఘటన ఒకటైతే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా వ్యతిరేకంగా విషం చిమ్మటం మొదలుపెట్టింది. అదే సమయంలో టిడిపి మాజీ ఎంఎల్ఏ వంగలపూడి అనితలేఖ రాయగానే వెంటనే హై కోర్టు దాన్నే ఫిర్యాదుగా తీసుకుని కేసు పెట్టించింది. అంతేకాకుండా సిబిఐతో  విచారణ మొదలుపెట్టించేసింది. నిజానికి ఇది చాలా చిన్న కేసు. లా అండ్ ఆర్డర్ ఎస్ఐ స్ధాయి  దర్యాప్తు  చేయాల్సిన ఘటననే హైకోర్టు సిబిఐతో విచారణ చేయిస్తోంది. టిడిపి అయినా ఎల్లోమీడియా అయినా ఎలా చిత్రీకరించిందంటే డాక్టర్ ను ప్రభుత్వం పిచ్చోడిని చేసేస్తోందన్నట్లుగా గొడవ చేశాయి.

 

సిబిఐ ఎస్పీ విమలా ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ నడిరోడ్డులో డాక్టర్ గొడవ చేసినట్లు ధృవీకరించారు. మద్యం సేవించి జనాలతో పాటు పోలీసులను కూడా అమ్మనాబూతులు తిట్టినట్లు చెప్పారు. స్ధానికుల సాయంతోనే పోలీసులు డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో డాక్టర్ ప్రధాని, ముఖ్యమంత్రులను తిట్టిన విషయం వీడియోల్లో స్పష్టమైందన్నారు. తనను అదుపులోకి తీసుకోవటానికి వచ్చిన పోలీసులపైకి సిగిరెట్లు విసిరేసి వాళ్ళను కూడా తిట్టినట్లు సాక్ష్యలున్నట్లు చెప్పారు.

 

నాలుగు రోజులుగా సిబిఐ డాక్టర్ కుటుంబసభ్యులను,  కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న డాక్టర్లను, పోలీసు అధికారులను, డాక్టర్ ను అదుపులోకి తీసుకోవటానికి వెళ్ళిన పోలీసులను కూడా విచారించింది. అన్నీ కోణాల్లోను విచారణ జరిపిన తర్వాత డాక్టర్ పై  188, 357 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఎస్పీ చెప్పిన పద్దతిలో అయితే  అనుచిత ప్రవర్తనపై డాక్టర్ నే తప్పు పట్టినట్లుగా అర్ధమవుతోంది. మరి జరిగిన ఘటనకు ఉల్టాగా ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ కో, ఎల్లోమీడియా సిబిఐ విచారణపై ఏమి మాట్లాడుతుందో  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: