బహశా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వాస్తవం మాట్లాడిన మొట్టమొదటి మాట ఇదేనేమో. తొందరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఎంఎల్ఏలు, నేతలతో డిజిటల్ సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ’ పార్టీకి ద్రోహం చేసిన వారి విషయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల’ని పిలుపిచ్చాడు. ’పార్టి ద్రోహులు చరిత్రహీనులుగా మిగిలిపోతారాని’.. వారిని జనాలు ఆదరించరం’టు భారీ డైలాగులు చెప్పారు. ’పనిలో పనిగా ’ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’ అని కూడా చెప్పారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు ఇపుడు ఏదైతే చెప్పారో దాన్ని జనాలు ఇప్పటికే ఆచరణలో పెట్టినట్లే అనిపిస్తోంది. ఆయనేమన్నారు పార్టీకి ద్రోహం చేసిన వారిని జనాలు ఆదరించరు అని కదా చెప్పింది. మొన్నటి ఎన్నికల్లో జనాలు చేసిందదే కదా ? 23 సీట్లు మాత్రమే ఇచ్చి ఘోరంగా ఓడించారంటే అర్ధమేంటి ? జనాలు ఆదరించలేదనే కదా ? అంటే జనాలకు ద్రోహం చేసిందెవరూ స్పష్టంగా మొన్నటి ఎన్నికల్లోనే తేలిపోయింది. అలాగే ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కూడా చెప్పాడు.  ముగ్గురు ఎంఎల్ఏలు చేసిందదే కదా ?

 

చంద్రబాబు, చినబాబు ద్రోహం చేస్తున్నారంటూ ముగ్గురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరామ్ పార్టీకి దూరంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలతో జనాలకు మంచి చేద్దామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకుంటూ చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడని రెబల్ ఎంఎల్ఏలు మండిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలను అడ్డుకుంటే జనాలు క్షమించరంటూ ముగ్గురు ఎంఎల్ఏలు ఎంతగా చెప్పినా చంద్రబాబు అండ్ కో పట్టించుకోవటం లేదు. అందుకనే తామ  పార్టీకి దూరంగా జరిగినట్లు వాళ్ళే చెబుతున్నారు.

 

ఇక 1995లో పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ కు ద్రోహం చేసిందెవరో అందరికీ తెలిసిందే. ఎన్టీయార్ నిర్ణయాలు, పార్టీలో  లక్ష్మీపార్వతి జోక్యం నచ్చకపోతే  చంద్రబాబు పార్టీ నుండి బయటకు వెళ్ళిపోవాలి. సొంతంగా ఇంకో పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పాల్గొని జనాల మద్దతు కోరాలి. అంతేకానీ సొంత మామగారినే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీతో పాటు పార్టీని కూడా కబ్జా చేయటాన్ని ఏమంటారు ? పదవిలో నుండి దిగిపోయిన తర్వాత చంద్రబాబు గురించి  ఎన్టీయారే ఎన్నో ఇంట్వర్యూల్లో ద్రోహం చేశాడంటూ మండిపోయిన విషయం  అందరికీ తెలిసిందే.

 

ఐదేళ్ళ క్రితం జరిగిన విషయాలనే తీసుకుంటే వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు  టిడిపిలోకి ఎలా లాక్కున్నాడు ? అది వైసిపికి ద్రోహం చేయటమని చంద్రబాబుకు ఎందుకు అనిపించలేదు. పైగా వాళ్ళల్లో నలుగురిని మంత్రులుగా కూడా చేశాడు. అప్పట్లో చంద్రబాబు వైసిపికి ద్రోహం చేశాడని జనాలు అనుకోబట్టే మొన్నటి ఎన్నికల్లో ఫిరాయింపులకు బుద్ధి చెప్పారు. టిడిపి తరపున పోటిబ చేసిన 17 మంది ఫిరాయింపుం ఎంఎల్ఏల్లో గెలిచింది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో  ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రమే.  పోటి చేసిన ఫిరాయింపు ఎంఎల్ఏల్లో 16 మందిని జనాలు ఓడగొట్టారంటేనే చంద్రబాబు ద్రోహం చేశాడని జనాలు తీర్పిచ్చినట్లే  అర్ధమైపోతోంది.

 

ఏ రకంగా చూసినా పార్టీకి ద్రోహం చేసింది చంద్రబాబే కానీ మిగిలిన నేతలు కాదన్న విషయం స్పష్టమవుతోంది. ఇపుడు కూడా చంద్రబాబు పద్దతి నచ్చలేదు కాబట్టి ముగ్గురు ఎంఎల్ఏలు పార్టీకి దూరమైపోయారు. అంతేకాని తమదే అసలైన టిడిపి అని వాళ్ళు పార్టీలో గోల చేయలేదు. సో ఇన్ని సంవత్సరాలకు చంద్రబాబు నిజంగా నిజం మాట్లాడినట్లు అనిపిస్తోంది. కాబట్టి పార్టీ ద్రోహులెవరో ? పార్టీకి ద్రోహం చేసిందెవరో అందరికీ అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: