మొత్తనానికి చూస్తూ చూస్తూ అమరావతి ఉద్యమానికి అప్పుడే రెండు వందల రోజులు వచ్చేశాయ్. రెండు వందలు ఏమి ఖర్మ రెండు వేల రోజులైనా, ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా కనిపిస్తుంది. ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు తమ్ముళ్లు అంటూ ఆ పెద్దాయన ప్రసంగాలు మధ్య మధ్యలో వినిపిస్తున్నాయి. ఎంత దూరం అయినా వెళదాం ఆపేదే లేదు అంటూ గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి. అసలు కరోనా వచ్చినా కంగారు పడడం లేదు... ఎవరు భయపెట్టినా భయపడడంలేదు. మూతికి మాస్క్ కట్టుకుని మరీ ఉద్యమానికి సై సై అంటున్నారు. రాష్ట్రమంతా అల్లకల్లోలం అయిపోతోంది. ఎక్కడ చూసినా అమరావతి అమరావతి అంటూ జనాలు పెద్దగా కేకలు వేస్తూ ఈ కరోనా ను కూడా లెక్క చేయకుండా పోరాటాలు చేస్తున్నారు. దీనికి లక్షలాది మంది దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం అమరావతి రాజధానిగా కావాలంటూ పోరాటం చేస్తున్నారు.

 

IHG

 

అవునా నిజాంగా అంత తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతుందా ? అనే అనుమానం కలుగుతుందా ? ఎందుకు జరగడంలేదు ? మీరు ఆ చానెళ్లు చూడడం లేదా ? ఈ పేపర్లు చదవడం లేదా ? కేవలం '' ఆ రెండు పేపర్లు '' ఈ నాలుగు చానళ్ళు మీరు చూడడం లేదా ? అయితే అర్జెంటుగా చూడండి. అందులో మాత్రమే ఈ ఉద్యమం ఎగిసి పడుతుంటోంది. డిబేట్లు, బ్రేకింగ్ లతో దద్దరిల్లుతోంది. అసలే 200 రోజులు దాటింది అంటూ ఆ చానెళ్లు ఊదరగొడుతున్నాయ్. అసలు ఈ కరోనా సమయంలో సామజిక దూరం, భౌతిక దూరం అంటూ హడావుడి జరుగుతోంది. మరోవైపు జనాలంతా ఈ కరోనా భయంతో ఇళ్ల నుంచి బయటకి వచ్చేందుకు భయపడుతున్న ఈ సమయంలోనూ అమరావతి ఉద్యమం అంటూ పెద్ద హడావుడి జరుగుతోంది, రాష్ట్రమంతా అల్లకల్లోలం అయిపోతోంది అన్నట్టుగా, జగన్ ప్రభుత్వం అమరావతి ఉద్యమానికి భయాందోళన చెందుతున్నట్టుగా ఆ మీడియాలో మాత్రమే... అంటే ప్రత్యేకించి అమరావతి పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భారీగా భూములు కొన్న మీడియా అధిపతులు, టీడీపీ కీలక నాయకులు మాత్రమే మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ హడావుడి చేస్తున్నారు. కేవలం రెండు మూడు ఊళ్లకు మాత్రమే పరిమితం అయిన అమరావతి ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా చూపించి, ప్రభుత్వంపై బురద జల్లుతూ, లభ్ది పొందాలనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.

 

 

అసలు రాజధాని ప్రకటనకు ముందే అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీగా తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ఆ తరువాత రాజధాని ప్రకటన అప్పటి టీడీపీ ప్రభుత్వం  చేసింది అనే విమర్శలు ఉన్నాయి. ఇక వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరాంధ్ర, రాజయలసీమ, కోస్తా ఆంధ్ర ఈ మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని అడుగడుగునా అడ్డుకుంటూ కొన్ని మీడియా సంస్థలు,టీడీపీ నాయకులు అడ్డుకుంటూ, వస్తున్న తీరు బాధాకరమే. ఇక ఇప్పుడూ.. ఎప్పుడూ ఈ అమరావతి ఉద్యమం జరుగుతూనే ఉంటుంది ..కాకపోతే ఆ మీడియాల్లో మాత్రమే. 
  

మరింత సమాచారం తెలుసుకోండి: