సెటైర్ : అచ్చెన్న సెట్ లోకేష్ మైండ్ అప్ సెట్ ?  

ఎవరు అవునన్నా కాదన్నా, సైకిల్ పార్టీ లో బాబు గారు తర్వాత ఆ స్థాయిలో పెత్తనం ఏం చేస్తుంది.. చేయబోతోంది అన్నీ ఆయన తనయుడు చినబాబు మాత్రమే. ఇప్పటికీ తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ తనను తాను నిరూపించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తానే సీఎం అన్నట్లుగా హడావిడి చేసిన ఆయన ఆ సమయంలో పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేశారని, ఆయన భయంతో చాలామంది నాయకులు పక్క పార్టీ ల్లోకి భయపడుతూ వెళ్లిపోయారని, ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అసలు ఆ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా, లోకేష్ పేరు చెప్పి ఆయనను దోషిగా నిలబెట్టి, తమ మనసులోని బాధను బయటపెట్టి , అందరూ చంద్రబాబుపైనే నిందలు మోపి మరీ బయటకి వెళ్లారు.  


ఇక చంద్రబాబుకు సైతం ఆయనపై పెద్దగా నమ్మకం లేకపోవడంతో, ఈ పార్టీ బరువు బాధ్యతలను ఎవరికి అప్పజెప్పాలా అనే విషయం తెలియక తెగ ఆందోళనకు గురై పోయారు. తాను చూస్తే ఎంతో కాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి లేకపోవడంతో, లోకేష్ బాబును మించిన సమర్ధుడు మరొకరు ఎవరూ ఉండకుండా,  పార్టీని ఉన్నత స్థానానికి తీసుకు వచ్చే నాయకుడు ఎవరైనా దొరుకుతారేమో అని చంద్రబాబు ఎదురు చూపులు చూసినా, లోకేష్ కంటే తక్కువ పెర్ఫార్మెన్స్ చూపించే నాయకులెవరూ కనిపించకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా దూకుడు గా ఉండే అచ్చెన్నాయుడు మియమించాలని చూసారు.


కానీ అచ్చెన్న దూకుడు ముందు తాను నిలబడలేను అని లోకేష్ ముందుగానే గ్రహించి ఎట్టి పరిస్థితుల్లోనూ, ఆయనను టీడీపీ అధ్యక్షుడిగా నియమించేందుకు వీల్లేదంటూ గట్టిగానే హడావుడి చేయడంతో, బాబు వెనక్కి తగ్గిపోయారు. కానీ టిడిపి కోసం, చినబాబు కోసం తాను ఇంత గట్టిగా కష్టపడితే, నాకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఎక్కడ అలిగి, అసలు గుట్టు బయటపెడతాడో అని భయపడి, లోకేష్ ను బుజ్జగించి ఇలా దారికి తెచ్చుకుని మొత్తానికి అచ్చెన్నకు కిరీటం పెట్టేశారు. అది పూల కిరీటమో, ముళ్ల కిరీటమో అనేది అచ్చెన్నకే రానున్న రోజుల్లో తెలిసొస్తుందిలే అంటూ టీడీపీ నాయకులే ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం అచ్చెన్న అధ్యక్ష పీఠం పై కూర్చోవడంపై తన ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: