స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు భలే సలహా ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అర్ధాంతరంగా వాయిదా వేసిన స్ధానిక సంస్ధల ఎన్నికలను మళ్ళీ నిర్వహించే విషయమై నిమ్మగడ్డ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. నిమ్మగడ్డ వైఖరితో విభేదించిన వైసీపీ సమావేశానికి హాజరుకాలేదు. అందరు అనుకున్నట్లుగానే దాదాపు 18 పార్టీలు సమావేశానికి హాజరయ్యాయి. వైసీపీ అనుమానించినట్లుగానే అన్నీ పార్టీలు ఎన్నికలు ఎన్నికలను నిర్వహించాలనే అభిప్రాయపడ్డాయి. పనిలోపనిగా కొన్ని పార్టీలు ఎన్నికలు వాయిదాపడిన సమయానికి ఏకగ్రీవమని ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపిటీసీ లను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశాయి. తెలుగుదేశంపార్టీ,  బీజేపీ, బిఎస్పీ, సీపీఐలు ప్రధానంగా ఈ డిమాండ్ ను ఎప్పటినుండో చేస్తున్నాయి. సమావేశానికి హాజరైన పార్టీల నుండి ఈ రెండు డిమాండ్ల చాలామంది ఊహిస్తున్నదే.




సరే రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఎలాగున్నా నిమ్మగడ్డ ఏమి చేయబోతున్నారన్నదే కీలకంగా మారింది. అయితే ఇదే సమయంలో అంబటి ఓ మంచి సలహా ఇచ్చారు నిమ్మగడ్డకు. అదేమిటంటే చంద్రబాబునాయుడు సూచించిన వాళ్ళనే జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా, ఎంపిటీసీలుగా డిక్లేర్ చేసేయమని. నిమ్మగడ్డలోకి చంద్రబాబు ఆవహించాడంటూ అంబటి ఎద్దేవా చేశారు. తాము ఎన్నికల్లో పాల్గొనేందుకు భయపడటం లేదని అంబటి స్పష్టంగా చెప్పారు. కాకపోతే ఒకే కరోనా వైరస్ కేసున్నపుడు దాన్నే బూచిగా చూపించి ఎన్నికలను వాయిదావేసిన నిమ్మగడ్డ ఇపుడు 4 వేల కేసులు నమోదవుతున్నపుడు ఎన్నికలను ఎలా నిర్వహిద్దామనుకుంటున్నారో ముందు నిమ్మగడ్డ సమాధానం చెప్పాలన్నారు.  చంద్రబాబు మనసులో ఉన్నదాన్నే నిమ్మగడ్డ తన నిర్ణయంగా చెబుతున్నాడన్న విషయం అందరికీ తెలుసన్నారు.




స్టేట్ ఎలక్షన్ కమీషన్ను నిమ్మగడ్డ కొన్నిపార్టీలకు తాకట్టుపెట్టేసినట్లుగా అంబటి ఆరోపించారు. నిమ్మగడ్డ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో వచ్చే అభిప్రాయాలేంటో ఇంతకన్నా భిన్నంగా అంచనావేసేందుకు లేదన్నారు. ఏదేమైనా అంబటి ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టేస్తే నిమ్మగడ్డ వ్యవహారశైలి కూడా ఇలాగే ఉంటోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఒకే ఒక కేసున్నపుడు ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ మరి నాలుగు వేల కేసులు నమోదవుతున్న సమయంలో ఎన్నికలను ఎలా నిర్వహించాలని అనుకుంటున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా రాష్ట్రప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికల నిర్వహణపై ఎటువంటి నిర్ణయము తీసుకోవద్దని సుప్రింకోర్టు స్పష్టంగా ఆదేశించినా నిమ్మగడ్డ ఏమాత్రం లెక్కచేయలేదు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే ఇపుడు కూడా ఏకపక్షంగా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించేశారు.




ఇక్కడ చాలామందికి అర్ధంకాని విషయం ఏమిటంటే నిమ్మగడ్డ చెప్పినట్లు టీడీపీ అండ్ కో పార్టీలు ఆడుతున్నాయా ? లేకపోతే టీడీపీ చెప్పినట్టల్లా నిమ్మగడ్డ తలూపుతున్నారా ? అన్నదే అర్ధం కావటం లేదు.  ఎందుకంటే అప్పట్లో కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను నిర్వహించలేమని నిమ్మగడ్డ చెప్పినపుడు చంద్రబాబు అండ్ కో నిమ్మగడ్డకు మద్దతుగా నిలబడ్డారు. కరోనా వైరస్ కేసులు వేలల్లో నమోదవుతున్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ నిర్ణయించగానే మళ్ళీ టీడీపీ మద్దతుగా నిలబడ్డాయి. ఈ కారణంగా నిమ్మగడ్డ-చంద్రబాబులో ఎవరు చెప్పినట్లు ఎవరు వింటున్నారు ? అన్నది మిలియన్ డాలర్ట ప్రశ్నగా మారిపోయింది. మరి అంబటి చెప్పిన సలహాను నిమ్మగడ్డ పాటిస్తే అసలు గొడవే ఉండదు కదా ? మరి ఏం చేస్తారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: