ఎల్లోమీడియా వ్యవహారమే భలే తమాషాగా ఉంటుంది. తమకు అనుకూలంగా ఉండే వార్తలు, డెవలప్మెంట్ల విషయంలో ఒకలాగుంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి గానీ లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విషయాల్లో కూడా రెచ్చిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. అదే చంద్రబాబునాయుడుకు కానీ లేదా ఎల్లోబ్యాచ్ లో ఎవరికైనా ఇబ్బంది కలిగే వ్యవహారాలు జరిగినపుడు అస్సులు అటువంటి డెవలప్మెంట్ జరగనట్లు లేదా తమ దృష్టికి రానట్లే వ్యవహరిస్తుండటమే విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడీ విషయం ఎందుకంటే అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సుప్రింకోర్టులో విచారణ జరిగింది. గతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసీబీ విచారణ విషయంలో హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ గ్యాగ్ ఆర్డర్ ను బుధవారం సుప్రింకోర్టు బ్రేక్ చేసింది. అంతేకాకుండా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కీలకమైన మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరో 12 మందికి కూడా నోటీసులు జారీ చేసింది.




సుప్రింకోర్టు తాజా ఆదేశాలతో ఇంతకాలం అమల్లో ఉన్న గ్యాగ్ ఆర్డర్ ను ఎత్తేసినట్లయ్యింది. అంటే ఎఫ్ఐఆర్ లో ఏసీబీ పేర్కొన్న వాళ్ళ పాత్రపై నిర్భయంగా మీడియా+సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు వచ్చేందుకు మార్గం ఏర్పడింది. సుప్రింకోర్టు జారీ చేసిన ఆదేశాలు ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగానే భావించాలి. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసీబీ విచారణ గనుక మొదలైతే టీడీపీలో లేకపోతే చంద్రబాబుతో అత్యంత సన్నిహితం కలిగున్న వాళ్ళందరి భూభాగోతాలన్నీ బయటపడతాయి. ఇప్పటికే ఇన్ సైడర్ ట్రేడింగ్ ముసుగులో చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీలో కీలక నేతలు, సన్నిహితులు  4075 ఎకరాలను కొనుగోలు చేశారని ప్రభుత్వమే స్వయంగా వాళ్ళ వివరాలన్నీ బయటపెట్టింది. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ఎత్తేసిన కారణంగా ఇపుడు వాళ్ళందరిపైనా ఏసీబీ స్వేచ్చగా విచారణ జరపవచ్చు.




ఇక్కడే ఎల్లోబ్యాచ్ గట్టిగా తగులుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇఫ్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో దమ్మాలపాటితో పాటు సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీరమణ కూతుర్లిద్దరు కూడా ఉన్నారు. మరి ఇటువంటి డెవలప్మెంట్లన్నీ చంద్రబాబుతో పాటు ఎల్లోబ్యాచ్ కు బాగా ఇబ్బందికరమే. అందుకనే సుప్రింకోర్టులో జరిగిన విచారణ కానీ, ఆదేశాలు కానీ ఎల్లోమీడియాలో ఎక్కడా కనబడ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న విషయం జరిగినా రెచ్చిపోయి బ్రేకింగ్ న్యూస్ అంటు పదే పదే టీవీల్లో ఊదరగొట్టే ఎల్లోమీడియా ఇపుడీ అంశాన్ని అసలు కవరే చేయలేదు.  కనీసం వెబ్ ఎడిషన్లలో కూడా ఎక్కడా కనబడనీయకుండా జాగ్రత్త పడ్డాయి. ఎందుకంటే స్వామిభక్తిని ప్రదర్శించటంలోనే ఇదంతా భాగమని అర్ధమైపోతోంది. అయినా తాను కూస్తే కానీ జనాలకు తెల్లారదని అనుకునే కోడి టైపుగానే ఉంది ఎల్లోమీడియా వ్యవహారం కూడా. ఎల్లోబ్యాచ్ కు వ్యతిరేకంగా జరిగే డెవలప్మెంట్లను ఎల్లోమీడియా కవర్ చేయకపోతే జనాలకు తెలీకుండానే ఉంటాయా ?

మరింత సమాచారం తెలుసుకోండి: