ఏంటో ఈ రాజకీయాలు అస్సలు అర్థం కావడం లేదు. ఒకరు సర్జికల్ స్ట్రైక్ అంటూ హడావుడి చేస్తుంటే, మరొకరు వరద బాధితులకు యాభై వేలు ఇస్తాము అంటూ... మరొకరు పాతికవేలు అంటూ,  ఇంకొక కుర్చీ కి కుర్చీ, బండి కి బండి అంటూ హడావుడి చేస్తున్నారు. అసలు జనాలకు మంచి నీళ్ళు ఫ్రీ ఫ్రీ అనే హామీలలో ఊహల్లో తేలియాడుతున్నారు. గ్రేటర్ లో విజయం సాధించేది ఎవరో తెలియదు గానీ, ఆ హామీలు చూస్తే కోటలు దాటుతున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలోనూ ప్రజలను బుట్టలో వేసుకునేందుకు నాయకులు పడుతున్న తపన చూస్తుంటే, పాపం వీరి బాధ ఏంట్రా అని అనిపిస్తుంది. 




రాష్ట్రంలోనే కాకుండా, దేశ నలుమూలల నుంచి రాజకీయ నాయకులు ఇప్పుడు ఎన్నికల ప్రచారం లో దిగిపోయి మరి హడావుడి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలి , కాదు కాదు తమ నే గెలిపించాలి అంటూ అన్ని పార్టీల నాయకులు వెంట పడుతున్నారు. దీంతో అసలు ఇప్పుడు జరగబోయేది పార్లమెంటు ఎన్నికలా, అసెంబ్లీ ఎన్నికలా అనే చర్చ జనాలలో కలుగుతోంది.
కార్పొరేటర్ల ఎన్నిక కే రాజకీయ పార్టీలు ఇంత హడావుడి చేస్తూ , కోట్లాది రూపాయల సొమ్ము ఖర్చు పెట్టి ఎక్క డెక్కడో ఉన్న నాయకులందరినీ ఇక్కడ దించి హడావుడి చేస్తున్నారు. ఇక్కడి భాష అర్థం కాకపోయినా,  ఆహా భావాలతో తెలుగు రాకపోవడం తో వచ్చే రాని భాషతో తంటాలు పడుతుంటే , జనాలకు కామెడీగా ఉంది. 



ఒక పార్టీ అని కాకుండా , అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా పేరున్న నేతలు అందరిని రంగంలోకి దించుతున్నారు. కొంతమంది సినిమా యాక్టర్లు ప్రచారంలోకి దిగిపోయారు. మీరు ఇంట్లో ఉండండి చాలు మీకు అన్నం కూడా మేమే తినిపించేస్తాం అన్నట్లుగా నాయకులు హడావుడి చేస్తున్నారు. ఓరి నాయనో ఈ గ్రేటర్ ఎన్నికల కే వీరి హడావుడి ఈ రేంజ్ లో ఉంది అంటే.. రాబోయే ఎమ్మెల్యే , ఎంపీ ఎన్నికలు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అంటూ జనాలు భవిష్యత్తును ఊహించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: