నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు అందరికీ ఆసక్తిని, వినోదాన్ని బాగానే పంచాయి. అసలు ఎప్పుడూ లేనంత కోపాన్ని , ఆవేశాన్ని బాబు ప్రదర్శించడం, అందరికీ ఆసక్తి నీ,  ఆందోళన ను కలిగించాయి. అసలు చంద్రబాబు లో ఇంత కోపం ఎలా ? ఎప్పటి నుంచి దాగి ఉంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందిన దగ్గర నుంచి ఈ తరహా కోపం ఆవేశం కట్టలు తెంచుకుంటూ వస్తోంది అనేది తెలుగు తమ్ముళ్ళ వాదన. వాళ్ల సంగతి పక్కన పెడితే, చాలా కాలంగా హైదరాబాద్ కే పరిమితమైపోయిన బాబు అసెంబ్లీ సమావేశాల్లో సత్తా చూపించేందుకు గట్టిగానే ప్లాన్ వేసుకున్నట్టు గా కనిపించారు. అందుకే అసెంబ్లీలో తన మనసులో ఉన్న అక్కసునంతా వెళ్లగక్కుతూ ఆవేశాన్ని ప్రదర్శించారు. ఆ ఆవేశానికి బహుమానంగా సస్పెన్షన్ వేటు వేయించుకుని బాబు అవమానం పాలవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. 




అసలు బాబు స్థాయికి ఇంత దిగజారి వ్యవహరించడం ఏంటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. బాబును మరో 12 మంది ఎమ్మెల్యేలను, అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో బాబు వ్యవహారశైలిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ అక్కడ జరిగిన ఘనకార్యం ఏమిటి అంటే , రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్  చేస్తూ,  ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుబట్టారు. టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెబుతూ ఉండగా, దానిపై మాట్లాడే అవకాశం  మళ్లీ సదరు టిడిపి ఎమ్మెల్యే కు దక్కింది. చంద్రబాబు జోక్యం చేసుకుని దీనిపై తాను మాట్లాడతాను అంటూ పట్టుబట్టారు. దీనికి డిప్యూటీ స్పీకర్ అనుమతించలేదు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.అసలు తాను మాట్లాడుతాను అన్నా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అంటూ సీట్లోంచి లేచి స్పీకర్ పోడియం ముందు బైఠాయించి హడావుడి చేశారు. 



మిగిలిన టిడిపి ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్లి బాబుతో జతకలిశారు. ఎంతకు అక్కడి నుంచి బాబు లే గకపోవడంతో ఒకరోజు పాటు సస్పెండ్ చేయాలని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో బాబుతో పాటు మరో 12 మంది పై డిప్యూటీ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసారు. సొంత పార్టీ ఎమ్మెల్యే కు మాట్లాడే అవకాశం డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా, తాను మాట్లాడాలంటూ బాబు చిన్న పిల్లవాడిలా పట్టుబట్టడం చివరకు సస్పెన్షన్ వేటు వేయించుకోవడం చర్చనీయాంశం అయింది. ఇది ఇలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ ను ఉద్దేశించి " ఏం పీకుతావ్ "అంటూ బాబు మాట్లాడినట్లుగా వార్తలు వినిపించాయి. దీనికి జగన్ సైతం స్ట్రాంగ్ గా ఈ అంశంపై గట్టిగా బాబు ను ఆడుకోవడం తో ఆయన ముఖం వాడిపోయింది. అయ్యో బాబు ఎంత హుందాగా బతికారు చివరి రోజుల్లో ఇంత  వైలెన్స్ అవసరమా అంటూ జాలితో కూడిన సెటైర్లు గట్టిగానే తేలుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: