హైదరాబాద్ ను నిర్మించిన పెద్ద తాపీ మేస్త్రి ని కాదనుకుని, కారు పార్టీకి ఓటు వేసి... గ్రేటర్ జనాలు గుండు సున్నా మిగిల్చినా,  గుండె నిబ్బరంతో ఉన్న నిన్ను చూస్తే మొక్కాలని ఉందయ్యా..! ఎప్పుడు చూసినా అది నేనే ఇది నేనే అంటూ గొప్పలు చెప్పుకుంటూ.. జబ్బలు చరుచుకున్న నీకు గ్రేటర్ జనాలు కుచ్చుటోపి పెట్టడం... తట్టుకోలేకపోతున్నామయ్య ! 106 సీట్లలో పోటీ చేస్తే గుండు సున్నా నే బహుమతిగా ఇచ్చిన ఈ జనాల తెలివితేటలు ని చూసి ఆశ్చర్యపోతున్నానయ్యా ! 2016 లో ఒక్క సీటు దక్కినా కలగని బాధ ఇప్పుడు గుండు సున్నా ను చూసి కలుగుతోందయ్యా ! 



అసలు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తంగా ఉన్న సమయం లో తాపీ పట్టుకు ని కొత్త నగరాన్ని నిర్మించి ఎన్నో టెక్ .. హైటెక్ లు నిర్మించిన నిన్ను మోసం చేసిన ఈ జనాలను చూస్తే కడుపు మండి పోతుందయ్యా ! 106 సీట్లలో పోటీ చేసిన మీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ దక్కకపోవడం చూసి దిమ్మ తిరిగి పోయిందయ్యా ! గ్రేటర్ లో ఫలితాలు ఈ విధంగా వస్తాయని మీకు, మ మీ సుపుత్రుడు కి బాగా తెలుసు కాబట్టే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండి నింద నీ మీద వేసుకోకుండా, రమణ మీదకి గెంటేసిన నీ తెలివితేటలు చూసి సలాం చేయాలనిపిస్తోందయ్యా ! అసలు 106 సీట్లలో పోటీ చేసి గెలిచి గ్రేటర్ పీఠం సంపాదించుకుందాము అని చూసిన నీ తెలివితేటలను చూసి మురిసిపోతున్నామయ్య !


 ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను దింపి .. మీరు కులాసాగా ఇంట్లో కూర్చున్నా ... అసలు గ్రేటర్ ఫలితాలతో సంబంధమే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ,  చేతులు దులిపేసుకున్న నీ రాజకీయ బుర్రకు సలాం చేస్తున్నామయ్యా ! పేరుకు తప్ప తెలంగాణలో పార్టీ ఉన్నా, ప్రయోజనం లేదు అని తెలిసినా, మీకు జాతీయ అధ్యక్షుడు హోదా ఇవ్వకుండా కాపాడుకునేందుకు తెలంగాణలోని పార్టీ నాయకులను బలిపశువును చేస్తున్న అమోఘమైన తెలివితేటలను చూసి ముచ్చటేస్తుందయ్యా ! 

మరింత సమాచారం తెలుసుకోండి: