ప్ర‌స్తుత న‌వీన కాలంలో టెక్నాల‌జి రోజురోజుకు డెవ‌ల‌ప్ అవుతూనే ఉంది. అనేక యాప్‌ల‌ను యూజ‌ర్లు ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇందులో ప్ర‌ముఖ‌మైన‌ది ముఖ‌పుస్త‌కం (ఫేస్‌బుక్‌) ఎవ‌రూ చూసినా ఫెస్‌బుక్ వాడుతూనే ఉంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగ దాదాపు 36 శాతం జ‌నాభా ఫేస్‌బుక్ అప్లికేష‌న్‌ను వాడుతున్నారు. అయితే ప్ర‌స్తుతం భ‌ద్ర‌త విష‌యంలో ఏ అప్లీకేష‌న్‌ను న‌మ్మ‌డానికి లేదు. అందులో ఫేస్‌బుక్ కూడా ఉంది. గ‌త కొన్ని రోజుల క్రితం భార‌త‌దేశంలోని ఫేస్ బుక్ ఖాతాదారుల వ్య‌క్తి గ‌త స‌మాచారం లీకైన విష‌యం తెలిసిందే.

  ప్రతి రోజు, డేటా లీక్‌లకు సంబంధించిన వార్తలను మ‌నం వింటూనే ఉంటున్నాం. అటువంటి పరిస్థితిలో, త‌మ‌ డేటా గురించి ఆందోళన చెందడం చాలా సహజం. అందువల్ల, త‌మ డేటా లీక్ అయ్యిందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం.
 
అయితే  మీ ఫేస్‌బుక్ డేటా లీక్ అవుతుందా?  లేదా అనే విష‌యాన్ని ఈ విధంగా తెలుసుకోవ‌చ్చు. అదే విధంగా మీ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నించేందుకు కొన్ని ద‌శ‌ల‌ను పాటించాలి.


 డేటా లీక్ అవుతుందో లేదో తనిఖీ చేయడానికి సాధారణ పద్ధతులు ఉపయోగించవచ్చు:
 
 
'హావ్ ఐ పిన్డ్' అనే వెబ్‌సైట్ ద్వారా మీ ఫేస్‌బుక్ డేటా లీక్ అయ్యిందో లేదో తెలుసుకోవ‌చ్చు.
ఈ వెబ్‌సైట్ లో మీ ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్‌ను నమోదు చేయాలి. దీని ద్వారా మీ ఫేస్ బుక్‌ డేటా దొంగిలించబడిందా లేదా అని మీరు తెలుసుకోవచ్చు. ఇంతకు ముందు, వినియోగదారులు ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఇమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే శోధించే అవ‌కాశం ఉండేది. కానీ, ఇప్పుడు మీ వెబ్‌సైట్ నంబర్‌ను ఈ వెబ్‌సైట్‌లోని సెర్చ్ బాక్స్‌లో ఎంట‌ర్ చేయ‌వ‌చ్చు. అలాగే మీ సమాచారం ఈ లీకైన డేటాబేస్లో ఉందో లేదో వెబ్‌సైట్ ద్వార తెలిసిపోతుంది.
 
 
కొన్ని రోజుల క్రితం, ఒక వార్త వినియోగదారులను కదిలించింది. నివేదికల ప్రకారం, 533 మిలియన్ ఫేస్బుక్ ఖాతాల నుండి వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో ఉచితంగా లీక్ యినట్లు తెలిసింది. "బహిర్గతం చేసిన ఈ డేటాలో 106 దేశాల నుండి 533 మిలియన్లకు పైగా ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఉంది అని తెలిసింది. వీటిలో యుఎస్ లో 32 మిలియన్ల రికార్డులు, యుకెలో 11 మిలియన్లు మరియు భారతదేశంలో 6 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు" అని ఇన్సైడర్ తెలిపింది.
 
9.9 కోట్ల మంది భారతీయ వినియోగదారుల డేటా లీక్ అయింది.  
 
కొద్ది రోజుల క్రితం భారతదేశంలో డేటా లీక్ గురించి పెద్ద వార్తలు వచ్చాయి. ఇందులో సుమారు 9.9 కోట్ల మంది భారతీయుల డేటా లీక్ అయింది. 9.9 కోట్ల మంది భారతీయ మోబిక్విక్ వినియోగదారుల డేటాను తాము పేల్చివేసినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: