మ‌న‌కు ఇప్ప‌టి వ‌రకూ ఇల్లు, స్థ‌లాలు, కార్లు, బైకులు, సైకిళ్లు అద్దెకిస్తార‌ని తెలుసు. అయితే, ప్రేమికుల రోజు కోసం గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ని కూడా రెంటుకు ఇచ్చే సంప్ర‌దాయం కూడా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ప్రేమికురాలితో చిన్న చిన్న స‌ర‌దాలు తీర్చుకోవ‌డానికి.. త‌ల్లిదండ్రుల కోరిక తీర్చ‌డానికి గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ను కూడా అద్దెక‌స్తున్నారు. అదేంటి గ‌ర్ల్ ఫ్రెండ్‌ను రెంట్ ఇవ్వ‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..! అవును చైనా, తైవాన్‌, జ‌పాన్ వంటి దేశాల్లో ఇలా అద్దెకు గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ను సెట్ చెస్తారు. మ‌న దేశంలో అయితే, గ‌ర్ల్ ఫ్రెండ్స్‌తో తిరుగుతే తిడుతారు. కానీ చైనాలో అలా కాదు.. గ‌ర్ల్ ఫ్రెండ్ర్ లేరంటే మంద‌లిస్తారంట‌..


      దీంతో త‌ల్ల‌దండ్రుల తిట్ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి కొంద‌రు గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌ను  అద్దెకు తీసుకుంటున్నార‌ట‌. ఇలా అద్దెకు గర్ల్ ఫ్రెండ్ ను ఇచ్చే  యాప్స్ డ్రాగ‌న్ కంట్రీలో ఉన్నాయి. కానీ, ఇలా అద్దెకు గర్ల్ ఫ్రెండ్స్‌లా నటించ‌డం చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం అని ఆ అమ్మాయిలు చెబుతున్నారు. ప్రతిసారీ అపరిచిత వ్యక్తులతో ప్రేయ‌సిలా నటించాల్సి రావడం అంటే  కొంచెం ఇబ్బందిగా ఉంటుంద‌ని వాపోతున్నారు అమ్మాయిలు.


      చైనాలో లూనార్ న్యూ ఇయర్ రోజు మాత్రం గర్ల్ ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకోవడం చాలా ఖరీదైన విష‌యంతో కూడుకుంది. ఆ రోజుల్లో అద్దెకు గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకునేందుకు మన దేశ కరెన్సీలో రూ.34, 241 నుంచి రూ.  1 లక్షా 14 వేల వరకూ యువ‌కుల ఖర్చు చేస్తున్నార‌ట‌.  ముఖ్యంగా చైనా న్యూ ఇయర్ రోజున తమ కుటుంబంతో గడపడానికి సెల‌వుల‌పై వ‌చ్చిన ఎక్కువమంది యువ‌కులు ఆ సమయంలో అత్యధిక శాతం గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ను అద్దెకు తీస‌కుంటార‌ట‌. గ‌ర్ల్ ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకెళ్ల‌క‌పోతే  త‌ల్లిదండ్రులు, బంధువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో డ్రాగ‌న్ యువ‌త గ‌ర్ల్ ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకుంటారు. కానీ, అద్దెకు గ‌ర్ల్ ఫ్రెండ్‌ను తీసుకోవాలంటే ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. ష‌ర‌తులు పాటించ‌కున్నా, అమ్మాయితే అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: