ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మ‌తాల‌లో ప్ర‌ధానంగా క్రిస్టియానిటి, ఇస్లాం మతం వీటితో పాటు హిందూ మ‌తం కూడా ముందు వ‌ర‌సలో ఉంటుంది.. ఎందుకంటే ఎక్కువ జ‌నాభా ప‌రంగా ఉంది కాబట్టి. వీటితో పాటు పార్శి, జుడాయిజం, సిక్కు, బౌద్ధ మ‌తాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మ‌రోమ‌తం పుట్టుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. మూడు మ‌తాల‌యిన క్రిస్టియానిటీ, జుడాయిజం, ఇస్లాం క‌లిసి ఒక కొత్త మ‌తం ఏర్ప‌డుతోంది. ఈ మ‌తానికి అబ్ర‌హామీ అనే కొత్త పేరు పెట్టారు. నిజానికి ఈ కొత్త మ‌తానికి సంబంధించిన చర్చ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడాది క్రిత‌మే మొద‌ల‌యింది.


  అర‌బ్ దేశాల్లో మ‌తానికి సంబంధించి వివాదాలు చెల‌రేగ‌డంతో ఈ అబ్ర‌హామి మ‌తం మొద‌లైందంటా.. ఈజిప్టులో మ‌త ఐక్య‌త కోసం ప్రారంభించిన ఈజిప్టు ఫ్యామిలీ హౌజ్ ప‌దో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా అత్యున్న‌త ఇమామ్ అల్-హ‌జిహ‌త్ త‌య్య‌బ్ అబ్ర‌హామీ మ‌తాన్ని విమ‌ర్శించ‌డంతో మ‌తాన‌కి సంబంధించిన చ‌ర్చ తీవ్ర‌మైంది. అబ్ర‌హామీ మ‌తం అధికారికంగా ఉనికిలోకి రాక‌పోయినా.. ఆ మ‌తానికి పునాదులు వేసిన‌ట్టుగాని, ఆ మ‌తానికి సంబంధించిన అనుచ‌రులు ఉన్న‌ట్టుగా లేద‌ని తెలుస్తోంది. దీంతో పాటు ఆ మ‌తానికి చెందిన ఏ మ‌త గ్రంధాలు కూడా అందుబాటులో లేవ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో వ్య‌క్తం అయిన ప్ర‌శ్న‌తో క్రిస్టినాయిటీ, జుడాయిజం, ఇస్లాం మ‌తం క‌లిపి ఇబ్ర‌హామీ మ‌తం పుట్టుకొస్తుంద‌ని తెలుస్తోంది.

 

  అయితే, ఇప్పుడు ఇమామ్ ఈ మ‌తానికి సంబంధించి ఎందుకు మాట్లాడారు అనే చ‌ర్చ న‌డుస్తోంది. క్రిస్టియానిటీ, జుడాయిజం, ఇస్లాం మ‌తాల‌ను క‌లిపేయాల‌నే కోరిక‌తో పిలుపునిచ్చే వాళ్లు వ‌స్తారు. అన్ని చెడ‌ల నుంచి విముక్తి క‌ల్పిస్తామ‌ని చెబుతారని, అలాంటి వాళ్ల‌ను న‌మ్మొద్ద‌ని ఇమామ్ చెప్పాడు. అయితే, ఈ  మ‌తం ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌త విశ్వాల మ‌ధ్య కొత్త వివాదాల‌కు దారి తీస్తుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఈ మ‌తానికి ఇజ్రాయేల్‌, యూఎస్‌ను కూడా లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: