హార్ట్ ఎటాక్ సాదార‌ణంగా మ‌నుషుల‌కు వ‌స్తుంద‌ని అంద‌రికీ తెలుసు. కానీ, కొన్ని సంద‌ర్బాల్లో జంతువుల‌కు కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తోంది. అట్టహాసంగా జ‌రిగే వివాహ వేడుక‌ల్లో మ్యూజిక్‌, డ్యాన్స్ త‌ప్ప‌కుండా ఉంటాయి. కానీ, కొన్ని సంద‌ర్భాల్లో ఈ లౌడ్ సౌండ్ పొల్యూష‌న్ ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లిగిస్తుంటాయి. ఒకరి ఆనంద‌రం ఇంకొంద‌రికి ఇబ్బందిక‌రంగా ఉంటాయి కూడా. తాజాగా పెళ్లి వేడుక‌ల్లో డీజే సౌండ్ పోల్యూష‌న్ కార‌ణంగా ఒడిషాలో విచిత్ర‌మైన సంగ‌ట‌న జ‌రిగింది. పెళ్లి బ‌రాత్‌లో ఏర్పాటు చేసిన డీజే బాక్కుల నుంచి వెలువ‌డిన భారీ శ‌బ్దాల కార‌ణంగా కోల్లు చ‌నిపోయాయి.

   
   ఫౌల్ట్రీ ఫామ్‌లో ఉన్న త‌మ కోళ్లు డీజే సౌండ్ పొల్యూష‌న్ కార‌ణంగా చ‌నిపోయిన‌ట్టు ఓ మ‌హిళా రైతు ఆవేదన వ్య‌క్తం చేస్తోంది. త‌మ ఊళ్లో జ‌రిగిన పెళ్లి ఊరేగింపులో వెలువ‌డిన శ‌బ్ధాల కార‌ణంగానే కోళ్లు చ‌నిపోయాయ‌ని ఆరోపించింది.  బాలాసోర్ జిల్లా మైతాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో పెళ్లి బ‌రాత్ ఊరేగింపు ప్రారంభ‌మైంది. ఈ వేడుక‌లో చాలా ఎక్కువ మ్యూజిక్ సౌండ్ చేయ‌డంతో పాటు పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చార‌ని రంజిత్ ప‌రిదా అనే మ‌హిళ వెల్ల‌డించింది. ఈ శ‌బ్బ కాలుష్యం వ‌ల్ల త‌న పౌల్ట్రీలోని 63 బ్రాయిల‌ర్ కోళ్లు మృతి చెందిన‌ట్టు తెలిపింది.


   సౌండ్ త‌గ్గించాల‌ని పెళ్లి వాళ్ల‌ని కోరినా త‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని చెప్పింది. పైగా మ‌ద్యం మ‌త్తులో త‌న‌ను దూషించాల‌ని చెప్పుకొచ్చింది. త‌న ఫౌల్ట్రీ ఫామ్‌లో మొత్తం 200 కోళ్లు ఉండ‌గా భ‌యంతో ప‌రుగులు తీశాయ‌ని తెలిపింది. గంట త‌రువాత అందులోని 63 కోళ్లు చ‌నిపోయాయ‌ని ఫ‌రిదా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. బాధిత‌త మ‌హిళ రైతు స్థానిక ప‌శువైద్యుడిని సంప్ర‌దించ‌గా భారీ శ‌బ్దాల వ‌ల్లే షాక్‌కు గురై చ‌నిపోయిన‌ట్టు నిద‌ర్దారించారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన రామంచంద్ర అనే వ్య‌క్తి నుంచి ప‌రిదా ప‌రిహారం కోరింది.  కానీ, మ‌హిళ ఆరోప‌ణ‌లు నిరాదార‌ణమ‌ని న‌ష్టప‌రిహారం చెల్లించేందుకు ఆ వ్య‌క్తి నిరాక‌రించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: