భార‌త దేశంలో ఎన్న‌డూ లేని రీతిలో పిల్ల‌ల పుట్టుక త‌గ్గిపోయింది. పాత రోజుల్లో ఇంటికి ప‌దిమంది దాకా క‌నేవాళ్లు. నిజం చెప్పాలంటే త‌న బ‌డ్డికు పెళ్లి అయి పిల్ల‌ల్ని క‌నే స‌మ‌యంలో త‌ల్లి కూడా పిల్ల‌లు క‌నే సంద‌ర్భాలు జ‌రిగాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌న తాత‌ల కాలంలో జ‌రిగాయ‌ని అంద‌రికి తెలుసు.. ప్ర‌తి ఇంట్లో గంపెడు పిల్ల‌లు ఉన్న ప‌రిస్థితి నుంచి ఇప్పుడు క్ర‌మంగా ఇద్ద‌రు పిల్ల‌లు క‌న‌డ‌మే క‌ష్టంగా మారింది. గ‌తంలో ముగ్గురు పిల్ల‌లు వ‌ద్దు ఇద్ద‌రు పిల్ల‌లే ముద్దు అన్న నినాదాన్ని తీసుకువ‌చ్చారు. ఆ త‌రువాత ఇప్పుడు ఇద్ద‌రు అసలే వ‌ద్దు ఒక్క‌రే ముద్దు అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నారు.


  అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు లేదా ప్ర‌జ‌ల్లో బాధ్య‌త త‌గ్గడ‌మో, కుటుంబ వ్య‌వ‌స్థ కంటే వ్య‌క్తిగ‌త సంతోషం కోరువ‌డం కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. వివాహాలు చేసుకోవ‌డం త‌గ్గిపోయింది. అలాగే.. ప్ర‌స్తుతం ఉన్న ఉరుకు ప‌రుగుల‌ ప్ర‌పంచంలో అమ్మాయిల కోరిక‌లు అబ్బాయిలు తీర్చ‌లేక‌.. అబ్బాయిలు త‌మ కోరిక‌లు తీర్చ‌లేర‌ని అమ్మాయిలు పెళ్లి చేసుకోవ‌డం మానేశారు. కొంద‌రు ఏదో పెళ్లి చేసుకోవాలి త‌ప్ప‌దు అని ఆలోచించే స‌రికి 30 ఏండ్లు నిండిపోతోంది. లేదా జీవితంలో స్థిర‌ప‌డిన త‌రువాత‌నే పెళ్లి చేసుకుంటామ‌ని ఆగిన వారు కూడా ఉన్నారు.


 ఇవ‌న్ని క‌లిసి 30 సంవ‌త్స‌రాలు దాటిపోతున్నాయి. దీంతో అమ్మాయి- అబ్బాయిల ఆరోగ్య ప‌రిస్థితితో పాటు   ప్ర‌స్తుతం ఉన్న ఆహార అలవాట్ల కార‌ణంగా వారికి పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్టం అవుతోంది. అయితే, తాజా నివేదిక‌ల ప్ర‌కారం స‌గ‌టు ఒక కుటుంబంలో ఒక్క‌రు మాత్ర‌మే పుడుతున్నార‌ని తెలుస్తోంది. కొంద‌రికి  అస‌లు సంతానం కావ‌డమే లేదు. ఇక రాను రాను దేశంలో ప్ర‌జ‌లు పిల్ల‌లు కాన‌లాని ప్ర‌భుత్వాలు ప్రొత్స‌హించే ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో దేశ జ‌నాభా తిరోగ ముఖం ప‌ట్టే అవ‌కాశం ఉందిని తెలుస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: