"చిత్రంలో అన్నిశాఖలూ, అందరూ కనిపించాలి గానీ, దర్శకుడు కనిపించగూడదని నా ఉద్దేశ్యం. అన్నిశాఖలనూ కనిపింపజెయ్యడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రముంటుంది. అది పైకి కనిపించదు. కానీ అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు అలాంటి సూత్రం. అంటూ కమలాకర కామేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వాన్నినిర్వ‌చించారు. తెలుగు సినీ క‌ళామ‌త‌ల్లి గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. కమలాకర కామేశ్వరరావు అక్టోబర్ 4, 1911లో బందరులో జ‌న్మించారు. మరణం జూన్ 29, 1998లో మ‌ర‌ణించారు. ఈరోజు ఆయ‌న వ‌ర్ధంతి.  ఆయ‌న తెరకెక్కించిన‌న‌న్ని పౌరాణిక చిత్రాల‌ను బ‌హుశా ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో మ‌రెవ‌రికి సాధ్యం కాలేదేమో. సాంకేతిక ప‌రిజ్ఞానం అంత‌గా అభివృద్ధి చెంద‌ని నాటికాలంలోనే ఆయ‌న అద్భుత‌మైన‌...ప్రేక్ష‌కుల‌ను స‌బ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసే ఎన్నో చిత్రాల‌ను తెర‌కెక్కించారు.

 


కమలాకర కామేశ్వరరావు 1911, అక్టోబర్ 4 న బందరులో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా అక్కడే జరిగింది. ఆయన 1933లో బి.ఏ. పాసయాడు. అప్పటికే ఆయనకు సినిమా టెక్నిక్ మీద మంచి ఉత్సాహం ఏర్పడింది. వచ్చిన ప్రతి చిత్రమూ భాషతో నిమిత్తం లేకుండా తప్పక చూసేవాడు. చూసి ఊరుకోక ఫిల్మ్ టెక్నిక్ కు సంబంధించిన పుస్తకాలు తెప్పించి చదవడం అల‌వాటు చేసుకున్నాడు.  స్వతహాగా ఉన్న ఆసక్తికి ఇలా పుస్తకాల ద్వారా పొందిన విజ్ఞానం తోడవడంతో ఆయన విడుదలైన సినిమాల మీద విమర్శలు వ్రాయడం ఆరంభించాడు. కృష్ణా పత్రికలో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. ఆయన సినిమా విమర్శలకు ఎంతో విలువ ఉండేది. ఆ విమర్శలు విజ్ఞులందరికీ ప్రామాణికంగా ఉండేవి.

 


 ఆ విమర్శల్ని చదివి, వాటిలో 'బాగుంది' అని వ్రాస్తేనే ఆ సినిమాలను చూసేవాళ్ళు, బాగలేదని వ్రాస్తే చూడని వాళ్ళు కూడా ఉండేవారు. కృష్ణా పత్రిక స్థాపకుడు, సంపాదకుడు అయిన ముట్నూరు కృష్ణారావు కామేశ్వరరావు గురించి "మా సినీఫాన్" అని గర్వంగా చెప్పేవాడు. తొలుత విజయా వారి పాతాళభైరవి సినిమాకు ఆయన పనిచేశాడు. తర్వాత విజయా వారే నిర్మించిన చంద్రహారం సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడిన ఈ చిత్రం విజయావారి మునుపటి చిత్రాల వలె ఆర్థికంగా విజయవంతం కాలేకపోయింది. కానీ విమర్శకుల మెప్పును మాత్రం పొందింది. ఆ చిత్రంలోని టెక్నిక్ కు ఎందరో విమర్శకులు జోహార్లర్పించారు. ఆ సినిమాలోని కొన్ని దృశ్యాలు విదేశాల్లో టెలివిజన్ లో ప్రసారమవ‌డం గ‌మ‌నార్హం. 

 

కామేశ్వరరావు దర్శకత్వం వహించిన సినిమాలు:
చంద్రహారం (1954)
గుణసుందరి కథ (తమిళం)
పెంకి పెళ్ళాం (1956)
పాండురంగ మహత్యం (1957)
శోభ (1958)
రేచుక్క-పగటిచుక్క (1959)
మహాకవి కాళిదాసు (1960)
గుండమ్మకథ (1962)
మహామంత్రి తిమ్మరుసు (1962)
నర్తనశాల (1963)
పాండవ వనవాసం (1965)
శకుంతల (1966)
శ్రీకృష్ణ తులాభారం (1966)
శ్రీకృష్ణావతారం (1967)
కాంభోజరాజు కథ (1967)
వీరాంజనేయ (1968)
కలసిన మనసులు (1968)
మాయని మమత (1970)
శ్రీకృష్ణ విజయం (1971)
బాల భారతం (1972)
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం (1980)

 

మరింత సమాచారం తెలుసుకోండి: