తెలుగు సినిమా స్థాయిని పెంచిన న‌టుడు ఎస్‌.వి. రంగారావు. ఎస్వీయార్, నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి, విశ్వ‌నటుడిగా ఇలా ఎన్నో బిరుదుల‌తో ఆయ‌న్ను తెలుగు ప్రేక్ష‌కులు స‌త్క‌రించారు.తెలుగు వెండితెర‌పై న‌వ‌ర‌సాలు ప‌లికించి  ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచారు. యస్.వి. రంగారావు పేరుగాంచిన ఆయ‌న పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై 3న నూజివీడు, కృష్ణా జిల్లాలో ఎస్వీ రంగారావు  లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు. జ‌న్మించారు. 56 ఏళ్ల వ‌య‌స్సులో గుండెపోటుతో  1974 జూలై 18 చెన్నైలో క‌న్నుమూశారు. డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్న ఆయ‌న వృత్తి రీత్య అగ్నిమాపక శాఖలో ఉన్నతోద్యోగిగా ప‌నిచేశారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు.

 

 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం అతనుకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. 


ఎస్వీ రంగారావు నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి గిరిజ తల్లి దాసరి తిలకం అతనుకు జోడీగా నటించింది. కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. ఆత‌ర్వాత నాగిరెడ్డి, చక్రపాణి కలిసి విజయా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలో షావుకారు సినిమాలో సున్నపు రంగడు అనే కీలకమైన పాత్రను రంగారావుకిచ్చారు. ఈ సంస్థలో ప్రవేశించడం రంగారావు కెరీర్ కు గట్టి పునాది పడింది. తర్వాత అదే సంస్థ నిర్మించిన పాతాళ భైరవి (1951) సినిమాలో అతి ముఖ్యమైన మాంత్రికుడి పాత్రను రంగారావుకిచ్చారు. కొత్త నటుడికి అంత కీలకమైన పాత్రను ఇస్తున్నారని నిర్మాతలకు కొంతమంది హెచ్చరించినా వారు పట్టించుకోలేదు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో రంగారావుకి మంచి పేరు వచ్చింది. న‌ర్త‌న‌శాల‌, భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, విదయాగలే ఎతిలే ఎతిలే, కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించి విమ‌ర్శ‌కుల చేత ప్ర‌శంస‌లు అందుకున్నారు.


రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం చదరంగం ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం బాంధవ్యాలు తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి. నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు. 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది. 1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా ఆయన చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే 1974 జూలై 18వ తేదీన మద్రాసులో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.

 

ఎస్వీఆర్ న‌టించిన పేరుగాంచిన చిత్రాలు


షావుకారు - సున్నం రంగడు
పెళ్ళిచేసి చూడు - ధూపాటి వియ్యన్న
సంతానం - గుడ్డివాడు
మాయాబజార్ - ఘటోత్కచుడు
సతీ సావిత్రి - యముడు
భక్తప్రహ్లాద - హిరణ్యకశిపుడు
శ్రీకృష్ణ లీలలు - కంసుడు
యశోద కృష్ణ - కంసుడు
పాండవ వనవాసం - దుర్యోధనుడు
నర్తనశాల - కీచకుడు
హరిశ్చంద్ర - హరిశ్చంద్రుడు
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం - బలరాముడు
సంపూర్ణ రామాయణం - రావణుడు
దీపావళి - నరకాసురుడు
అనార్కలి - అక్బర్
మహాకవి కాళిదాసు - భోజరాజు
పాతాళభైరవి - మాంత్రికుడు
భట్టి విక్రమార్క - మాంత్రికుడు
బాలనాగమ్మ - మాంత్రికుడు
విక్రమార్క - మాంత్రికుడు
బంగారుపాప - కోటయ్య
బొబ్బిలియుద్ధం - తాండ్ర పాపారాయుడు

 

మరింత సమాచారం తెలుసుకోండి: