తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జూలై 9, 1927 - జనవరి 26, 2010) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఇతను చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. గుమ్మడి సినీప్రవేశం అదృష్ట దీపుడు (1950) సినిమాతో జరిగింది. రెండవ చిత్రం నవ్వితే నవరత్నాలు మూడవ చిత్రం పేరంటాలు, నాలుగవ చిత్రం ప్రతిజ్ఞ. అయితే మొద‌ట్లో చిన్న చిన్న పాత్రలు ద‌క్కినా..నిల‌దొక్కుకోవ‌డానికి మాత్రం స‌మ‌యం ప‌ట్టింది. 

 


అనేక‌సార్లు ఇంటికెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నా..స‌న్నిహితుల వారింపుతోమ‌ద్రాసులోనే ఆగిపోయారు. ఆ నిర్ణ‌యమే  ఆ త‌ర్వాతి రోజుల్లో ఆయ‌న‌కు కీర్తి తెచ్చిపెట్టే పాత్ర‌ల‌ను ద‌క్కేలా చేసింది.ఆరంభకాలంలో చిత్రాలలో నటించడానికి మద్రాసు వచ్చి తీసుకు వచ్చిన డబ్బులు అయిపోయి రెండు రోజుల మంచినీటితో సరిపెట్టుకున్నాడు. ఆ తరువాత కంపెనీ డైరెక్టర్ సహాయం చేస్తానని చెప్పిన నిరాకరించి ఖర్చుల కొరకు తన పెళ్ళినాటి ఉంగరం తాకట్టు పెట్టి తిరిగి విడిపించుకున్నాడు. అతను జీవితంలో అతను భోజనానికి ఇబ్బంది పడిన రోజులు ఇవేనని అతనుమాటల వలన తెలుసుకోవచ్చు.

 


గుమ్మడి ప్రారంభవిద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు స్వంత ఊరు అయిన రావికంపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో కొల్లూరు ఉన్నత పాఠశాలలో జరిగింది. అక్కడ అతను ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు రంగస్థల జీవితం యాదృచ్ఛికంగా జరిగింది. అతను ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజులలోనే ఉపాద్యాయుని ఆదేశంతో పేదరైతు అన్న నాటకంలో వయోవృద్ధుడైన పేద రైతుగా నటించాడు. ఆ నాటకంలో అతను నటనకు ఒక గుర్తింపు లభించింది. అలా అతను రంగస్థల అనుభవం మొదలైంది.గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన అర్ధాంగి చిత్రంలో అతనుకు భార్యగా నటించిన శాంత కుమారి అతనుకంటే 8 సంవత్సరాలు పెద్దది కావ‌డం విశేషం. అలాగే అతనుకు పెద్ద కుమారుడిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు అతనుకంటే 3 సంవత్సరాలు పెద్ద. అతను చిన్న కుమారుడిగా నటించిన జగ్గయ్య అతను కంటే 1 సంవత్స్దరం పెద్ద. 

 


మహామంత్రి తిమ్మరుసు చిత్రంలో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలుగా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో ఓ అరుదైన ఘటన. అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది. గుమ్మడి చివరిసారిగా 2008 సంవత్సరంలో జగద్గురు శ్రీ కాశీనాయని చరిత్ర సినిమాలో తన జీవితానికి దగ్గరగా వున్న కాశీనాయన పాత్ర పోషించాడు. గుమ్మడి 'చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు' పేరుతో జీవనస్మృతుల్ని అక్షరీకరించాడు. తొలి ముద్రణ ప్రతులన్నీ, కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఓ ఆనవాలు. నటుడిగా అవకాశాలు వచ్చినా ఆధునిక చిత్రసీమ యొక్క పోకడ నచ్చక చివరి కాలంలో నటనకు దూరంగా ఉన్నాడు.

 


 గుమ్మడికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. హైద్రాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో 2010, జనవరి 26 న ఆరోగ్యం క్షీణించి మ‌ర‌ణించాడు. అతను చివరిగా మాయాబజార్ (రంగులలోకి మార్చిన) ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపాడు. "ఆ గొప్ప సినిమాను రంగులలో చూడటానికేమో, నేను ఇంత దీర్ఘకాలం బ్రతికి వున్నాను" అని సంతోషం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. 1998 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డు నిచ్చి సత్కరించింది. 1982 : మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం చేత గౌరవించబడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: