హోమీ జహంగీర్ భాభా (1909 అక్టోబరు 30 - 1955 జనవరి 24) భారతీయ కేంద్రక భౌతిక శాస్త్రవేత్త, వ్యవస్థాపక డైరక్టరు, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటాల్ రీసెర్చ్  లో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా పనిచేసాడు. అతనిని "భారత అణు కార్యక్రమానికి పితామహుడు" అని పిలుస్తారు. అతను భాభా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్, ట్రోంబే కు వ్యవస్థాపక డైరెక్టర్‌. అతని గౌరవార్థం ఆ సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భారత అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్న , అణ్వాయుధాల సంస్థలకు అతను డైరెక్టర్‌గా పర్యవేక్షించాడు. అతనికి ఆడమ్స్ ప్రైజ్ (1942), పద్మభూషణ (1954) పురస్కారాలు లభించాయి. 1951, 1953–1956లలో అతను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డాడు



భాభా సాధారణంగా భారత అణుశక్తికి పితామహుడిగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా, యురేనియం నిల్వల కంటే దేశంలోని విస్తారంగా లభ్యమవుతున్న థోరియం నిల్వల నుండి శక్తిని వెలికి తీయడంపై దృష్టి సారించే వ్యూహాన్ని రూపొందించిన ఘనత ఆయనకు ఉంది. ఈ థోరియం కేంద్రీకృత వ్యూహం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భిన్నంగా ఉంది. ఈ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించడానికి భాభా ప్రతిపాదించిన విధానం భారతదేశం యొక్క మూడు దశల అణు విద్యుత్ కార్యక్రమంగా మారింది.హోమి జహంగీర్ భాభా ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పనిచేస్తున్నప్పుడు, కేంద్రక భౌతిక శాస్త్రం, కాస్మిక్ కిరణాలు, హై ఎనర్జీ ఫిజిక్స్, ఇతర హద్దులలో భౌతిక శాస్త్ర జ్ఞానం పరిశోధనలకు అవసరమైన సదుపాయాలు కలిగిన సంస్థ ఏదీ భారతదేశంలో లేదు. ఇది 'ప్రాథమిక భౌతిక శాస్త్రంలో శక్తివంతమైన పరిశోధనా పాఠశాల' ను స్థాపించడానికి దోహదపడింది. దీని ఫలితంగా 1944 మార్చిలో సర్ డోరాబ్జీ టాటా ట్రస్ట్‌కు ఒక ప్రతిపాదనను పంపడానికి అతనిని ప్రేరేపించింది.



హోమి జహంగీర్ భాభా సంపన్న పార్సీ కుటుంబంలో జన్మించాడు. అతను వ్యాపారవేత్తలు దిన్షా మానెక్‌జీ పెటిట్, డోరబ్జీ టాటాకు సంబంధించినవాడు. అతను 1909 అక్టోబరు 30 న జన్మించాడు. అతని తండ్రి జెహంగీర్ హోర్ముస్‌జీ భాభా పార్సీ న్యాయవాది, అతని తల్లి మెహెరెన్. అతను బొంబాయి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో తన ప్రారంభ విద్యను అభ్యసించాడు. తన సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఆనర్స్ తో ఉత్తీర్ణత సాధించిన తరువాత 15 సంవత్సరాల వయస్సులో ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ప్రవేశించాడు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కైయస్ కాలేజీలో చేరడానికి ముందు 1927 లో రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో చదివాడు. భాభా కేంబ్రిడ్జ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందాలని, తరువాత భారతదేశానికి తిరిగి రావాలని అతని తండ్రి, మామ డోరబ్జీ పట్టుబట్టి ప్రణాళిక వేసినందువల్ల ఈ విద్యనభ్యసించాడు. అతను జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ లేదా టాటా స్టీల్ మిల్స్‌లో మెటలర్జిస్ట్‌గా చేరాడు.1966 జనవరి 24 న మోంట్ బ్లాంక్ సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 కూలిపోవడంతో హోమి జె. భాభా మరణించాడు. పర్వతం సమీపంలో ఉన్న విమానం స్థానం గురించి జెనీవా విమానాశ్రయం, పైలట్ మధ్య అపార్థం ఏర్పడటం ప్రమాదానికి అధికారిక కారణంగా చెప్పబడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: