అలిక్ పదంసీ (5 మార్చి 1928 – 17 నవంబరు 2018) పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త. 1982లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం ‘గాంధీ’లో మహ్మదాలీ జిన్నా పాత్రలో నటించి అందరి మన్ననలను అందుకున్నాడు. భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ లింటాస్ కు 1980 నుంచి 1994 వరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన ఆయన ఆ సంస్థను దేశంలోనే అగ్రశ్రేణి అడ్వర్‌టైజ్‌మెంట్‌ సంస్థగా తీర్చిదిద్దాడు. తన అరవై ఏళ్ల కెరీర్‌లో 70కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వం వహించిన నాటకాల్లో ఎవిటా, జీసస్‌ క్రైస్ట్‌ సూపర్‌స్టార్‌, తుగ్లక్‌ ఎంతో ప్రాచుర్యం పొందాయి. 2002 లో పద్మశ్రీ పురస్కారం. ముంబై అడ్వర్‌టైజ్‌మెంట్‌ క్లబ్‌..అడ్వర్‌టైజింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సెంచరీతో గౌరవించింది. 2012లో సంగీత నాటక్‌ అకాడమీ నుంచి 2012లో ఠాగూర్‌ రత్న అవార్డు పొందారు.


భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ లింటాస్ కు 1980 నుంచి 1994 వరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన ఆయన ఆ సంస్థను దేశంలోనే అగ్రశ్రేణి అడ్వర్‌టైజ్‌మెంట్‌ సంస్థగా తీర్చిదిద్దాడు. దాదాపు 100కు పైగా ప్రధాన ఉత్పత్తులు, బ్రాండ్లకు ఆయన వాణిజ్య ప్రకటనలు రూపొందించాడు. ఇదే సమయంలో అతను లింటాస్‌ దక్షిణాసియా ప్రాంతీయ కోఆర్డినేటర్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ప్రపంచ అడ్వర్‌టైజింగ్‌ రంగంలో ఆస్కార్‌గా పరిగణించే ఇంటర్నేషనల్‌ క్లియో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు పదమ్‌సీ కావటం విశేషం. భారత అడ్వర్‌టైజ్‌మెంట్‌ పితామహుడిగా గుర్తింపు పొందిన ఈయన సాధారణ ఉత్పత్తుల నుంచి లగ్జరీ ఉత్పత్తుల వరకు అన్నీ వర్గాల వారి మదిని చూరగొనే విధంగా అద్భుతమైన, గుర్తుంచుకోదగిన వాక్యాలతో ప్రకటనలను రూపొందించాడు.


అతని నేతృత్వంలోని లింటాస్‌ అడ్వర్‌టైజ్‌మెంట్‌ రూపొందించిన డిటర్జెంట్‌ ఉత్పత్తి అయిన సర్ఫ్‌ కోసం లలితాజీ, ఆటో దిగ్గజం బజాజ్‌ కోసం హమారా బజాజ్‌, చెర్రీ బ్లాసమ్‌ షూ పాలిష్‌ కోసం చెర్రీ చార్లీ, టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ కోసం మజిల్‌ మ్యాన్‌, జలపాతంలో లిరిల్‌ గర్ల్‌, ఫెయిర్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌, బోల్డ్‌ కామసూత్ర కపుల్‌ వంటి ప్రకటనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1994లో లింటాస్‌ ఇండియా నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఏపీ అడ్వర్‌టైజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను స్థాపించి పలు వాణిజ్య ప్రకటనలను రూపొందించాడు. బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ స్కూటర్‌ కోసం పదమ్‌సీ రూపొందించిన వాణిజ్య ప్రకటన హమారా బజాజ్‌. చాలా ఏళ్ల పాటు ప్రజల నోళ్లలో పలికింది. ఇప్పటికీ పాత తరం వారు ఆ ప్రకటనను ఇప్పటికీ మరిచిపోలేరు. అంతేకాకుండా బజాజ్‌ ఆటోను అగ్రస్థానానికి చేర్చటంలో ఆ ప్రకటన కీలక పాత్ర పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: