సాధారణంగా అంబరీష్ అనే పేరు వినగానే కొంతమంది తెలిసిన వాళ్లకు శ్రీ మంజునాథ సినిమా గుర్తొస్తే, మరికొంతమందికి ఆయన పార్లమెంట్ సభ్యుడు కదా అని గుర్తుకు వస్తుంది. అంబరీష్ కన్నడ సూపర్ స్టార్ సినిమా నటుడు. అంతేకాదు పార్లమెంట్ సభ్యుడు కూడా. ఈయన 1952 మే 29వ తేదీన మైసూర్ రాష్ట్రంలోని మండ్య జిల్లాలో దొడ్డిరాశినకేరే గ్రామంలో జన్మించారు. మీరు తల్లిదండ్రులు హుచ్చేగౌడ, పద్మమ్మ. ఈయన కూడా చాలామంది లాగే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎన్నో కలలు కన్నారు. ఒకసారి కన్నడ సినిమా దర్శకుడు పుట్టన్న కనగాల్ తన సినిమా అయినా నాగరహావు చిత్రానికి విలన్ పాత్ర కోసం వెతుకుతుండగా ఆయనకు అంబరీష్ కనిపించారు

అలా మొదటిసారిగా 1972లో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించిన ఈయన, ఆ తర్వాత కన్నడ, మలయాళం, తమిళ్ ,హిందీ, తెలుగు చిత్రాలలో నటించారు. అంతేకాదు ఈ భాషలన్నింటిలోనూ సుమారు 250 చిత్రాలకు పైగా నటించి రికార్డు సృష్టించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ పురస్కారంతో పాటు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అలాగే ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రం నుండి విష్ణువర్ధన్ పురస్కారం కూడా అందుకున్నారు.

ఈయన భార్య సుమలత .మనందరికీ మంచి సుపరిచితురాలు . స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు పొందింది . ఈయన 1994న భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం అడగగా, ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో రాజీనామా చేశారు. తరువాత జనతాదళ్ లో 1998 మాండ్యా శాసనసభ నియోజకవర్గం పోటీ చేసి గెలిచారు. అంతేకాకుండా సినిమా విషయానికి వస్తే, ఈయన శ్రీ మంజునాథ సినిమాలో రాజుగారి పాత్రలో నటించి, అందరి చేత ప్రశంసలు పొందారు. అలా తెలుగువారికి సుపరిచితులు అంబరీష్.


మరింత సమాచారం తెలుసుకోండి: