ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాస్యనటులకు కొరతే లేదు. కానీ అప్పట్లో ఒక  సినిమాలో హాస్యనటుడు అంటే అది ఒక ప్రత్యేకమైన నటనలా నటించడానికి, కేవలం కొంతమందికి మాత్రమే చెల్లుతుందని గుర్తింపు కూడా ఉండేది. అలా మొట్టమొదటిసారి తన హావభావాలతో ప్రేక్షకులను అలరించి, కడుపుబ్బ నవ్వించిన ఏకైక వ్యక్తి,  మొదటి హాస్యనటుడు రేలంగి . అంతే కాదు ఆయన మొట్టమొదటి హాస్య నటుడిగా  1970 లో పద్మశ్రీ అవార్డు కూడా గెలుపొందాడు. ఈయన అసలు పేరు రేలంగి వెంకట్రామయ్య. 1910 ఆగస్టు 9వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోని రావులపాడు అనే గ్రామం లో రామదాసు ,అచ్చయ్యమ్మ అనే దంపతులకుజన్మించారు. రేలంగి మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన తల్లి చనిపోవడంతో, ఈయన తండ్రి రామస్వామి, అచ్చయ్యమ్మ చెల్లెలు గౌరమ్మను వివాహమాడారు.

ఇక రేలంగి తండ్రి సంగీతం, హరికథలు నేర్పించేవారు. ఇక బాల్యమంతా రావులపాడులో, కాకినాడలోనే గడిచింది. ఇక చదువుకునే సమయంలోనే నాటకాలు వేయడం ప్రారంభించాడు . అలా 1935వ సంవత్సరంలో శ్రీ కృష్ణ తులాభారం చిత్రం ద్వారా దర్శకుడు సి.పుల్లయ్య సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే 1948 వరకు ఆయనకు చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. కానీ నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో సి. పుల్లయ్య దగ్గర పని చేయడం విశేషం. కీలుగుఱ్ఱం, పెద్దమనుషులు ,పాతాళభైరవి, గుణసుందరికథ, మిస్సమ్మ ,మాయాబజార్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటుడిగా తారా స్థాయికి చేరుకున్నాడు. ఏకంగా 300 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించిన ఏకైక వ్యక్తి.

తాడేపల్లిగూడెంలో రేలంగి ఒక నిర్మాణ సంస్థను కూడా నిర్మించాడు. దానిపేరే చిత్ర మందిర్. 1933 డిసెంబర్ 8వ తేదీన రేలంగి బుజ్జియమ్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి కుమారుడి పేరు  సత్యనారాయణ బాబు. రేలంగి తీరికలేకుండా సినిమాలోనే ఉండడంతో ఆమె ఇంటి బాధ్యతలన్నీ చూసుకునేది. రేలంగి నటుడిగా 300 సినిమాల్లో నటించి తారా స్థాయికి చేరుకున్న తరువాత ఎన్నో సన్మానాలు, బిరుదులు ,గజారోహణ, కనకాభిషేకాలు కూడా జరిగాయి. హాస్యబ్రహ్మ , నటచక్రవర్తి గా ఎన్నో బిరుదులను ప్రధానం చేశారు.

ఈయన చివరి దశలో తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతూ.. వైద్యులు ఎముకలు సంబంధించిన వ్యాధి అని చెప్పారు. 1975 నవంబర్ 27వ తేదీన ఉదయం తాడేపల్లిగూడెంలో తన నివాసంలో స్వర్గస్తులయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: