బహుముఖ ప్రజ్ఞాశాలి రావికొండలరావు.. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు ,నిర్మాత ,దర్శకుడు, రచయిత అలాగే పాత్రికేయుడిగా కూడా పని చేశాడు. ఇక దాదాపుగా ఆరు వందల చిత్రాలకు పైగా నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . ఇక ఈయన భార్య అయిన రాధాకుమారి కూడా ప్రముఖ సినీ నటీమణి. ఇక ఈయన 1932 సంవత్సరం, ఫిబ్రవరి 11వ తేదీన సామర్లకోట లో జన్మించారు. ఈయన తండ్రి పేరు రావి చిదంబరం. రాగి చిదంబరం వృత్తిరీత్యా పోస్ట్ మాస్టర్  అవడంతో ఇక ఆయన పదవి విరమణ తరువాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు.


ఇక నటుడిగా 1958వ సంవత్సరంలో శోభ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. ఇక అంతే కాదు రచయితగా కూడా చల్లని నీడ, పెళ్లిపుస్తకం, బృందావనం, భైరవద్వీపం వంటి సినిమాలకు, రచయితగా పని చేయడమే కాకుండా సంభాషణలు సమకూర్చిన వ్యక్తి. ఇక అంతే కాదు నిర్మాతగా కూడా బృందావనం, భైరవద్వీపం , శ్రీకృష్ణార్జున విజయం వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈయన ప్రతిభకు ఆంధ్ర విశ్వవిద్యాలయం గుర్తించి, కళాప్రపూర్ణ అనే బిరుదుతో గౌరవంగా సత్కరించింది. ఇక పాఠశాల చదువు మొత్తం కాకినాడ లోనే ముగియగా, మద్రాసుకు వెళ్లి అక్కడ  ఆనందవాణి అనే పత్రిక ఆఫీసులో సబ్ ఎడిటర్ గా పని చేశాడు. ఇక అంతే కాదు కొన్ని రోజులపాటు రమణ గారి ఇంట్లో, కూడా ఈయన నివాసం ఏర్పరుచుకున్నారు. ఇక ఆ తర్వాత ఆయన  కేరళకు వెళ్లి మలయాళం సినిమా లకు డైలాగులు కూడా రాసేవారు. ఇక ఈయనకు పొన్నలూరి బ్రదర్స్ వారి సినీ సంస్థలో కథలు రాసే డిపార్ట్మెంట్లో ఉద్యోగం కూడా వచ్చింది.

ఇక  ఈయన రాసిన బ్లాక్ అండ్ వైట్ పుస్తకాన్ని కూడా ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వం చేత నంది అవార్డును కూడా అందుకున్నాడు. ఇక జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకోవడం విశేషం. ఇక ఈయన జూలై 28, 2020 వ తేదీన సాయంత్రం గుండెపోటుతో హైదరాబాదులో బేగంపేట్ ఆస్పత్రిలో మరణించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: