ప్రముఖ తమిళ నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ కేవలం నటుడు మాత్రమే కాదు.. టెలివిజన్ నటుడు ,నేపథ్య గాయకుడు అలాగే హాస్యనటుడు కూడా. అంతేకాదు తమిళ సినీ ఇండస్ట్రీలో సామాజిక కార్యకర్తగా కూడా పనిచేశాడు ఆయన మొదటిసారి ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ముఖ్యంగా 2002లో వచ్చిన రన్, 2003లో వచ్చిన సామి, 2004 లో వచ్చిన పెరజగన్ అనే చిత్రాలకు గాను ఉత్తమ హాస్యనటుడిగా మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఐదు తమిళనాడు రాష్ట్రం నుండి చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నాడు.


ఇక ఈయన 1961 వ సంవత్సరం నవంబర్ 19 వ తేదీన , తమిళనాడు రాష్ట్రంలోని శంకరం కోవిల్ అనే గ్రామంలో జన్మించారు. ఇక ఈయన అమెరికన్ కాలేజ్ మధురై లో  ఉండే  కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఇక ఈయన కళలకు ఈయన చేసిన కృషికి గాను , భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును కూడా అందుకోవడం గమనార్హం. ఇక సినిమాలతో సమాజానికి ఏదో ఒక మెసేజ్ ని అందిస్తూ ఈయన చేసిన కృషికి,  సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను  కూడా పొందాడు. ఇక అంతే కాదు ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా పని చేయడమే కాకుండా కొంతమంది వ్యక్తులను ఇంటర్వూ కూడా చేయడం జరిగింది.

వివేక్ అంతేకాకుండా గ్రీన్ ఇండియా చాలెంజ్ లాగా గ్రీన్ కలాం ను  స్థాపించారు. అంతే కాదు ఈయన తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించాడు. ఇక వివేక్ అరుల్సేల్విన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇక చివరిసారిగా శ్వాస ఆడక చాతి నొప్పితో, ఒక్కసారిగా గుండె ఆగిపోయింది . ఇక 2021 ఏప్రిల్ 17వ తేదీన మరణించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: