శివసేన అధిపతి ఉద్ధవ్ థాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశమంతా త్వరితగతిన ఏకరీతి సివిల్ కోడ్‌ను అమలు చేయాలని ఉద్ధవ్ థాక్రే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని కొందరు ప్రజలు అడుగుతున్నారని, జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేశారని తాము అందుకే బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగామని ఉద్ధవ్ చెప్పారు.

దీంతోపాటు దేశంలో ఉమ్మడి సివిల్ కోడ్ ను అమలు చేయాలని తాను అమిత్ షాకు విన్నవిస్తున్నానన్నారు. దేశవ్యాప్తంగా అన్ని మతాలవారికి కామన్ సివిల్ కోడ్ అమలుపై చర్చ సాగుతుందని దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. దసరా ర్యాలీ సందర్భంగా ముంబై నగరంలోని శివాజీ పార్కులో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అధికారంలోకి రావడం ఖాయమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: