రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని విడిచిపెట్టటం వెనుకగల కారణాన్ని పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. ప్రస్తుతం పార్టీ స్థితిగతులపై ఖుర్షీద్ ఆవేదన వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పార్టీలో సమస్యలు పెరిగిపోయాయన్నారు. రాహుల్ రాజీనామా నిర్ణయం కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను కూడా పార్టీ విశ్లేషించలేకపోయిందన్నారు.

పార్టీ నేత తమను విడిచిపెట్టడమే పెద్ద సమస్య అని అన్నారు. రాహుల్ రాజీనామా చేసిన తరువాత పార్టీలో శూన్యత ఆవరించిందన్నారు. సోనియా గాంధీ పార్టీలో తాత్కాలిక ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ సమస్య మరింతగా పెరిగిదన్నారు. రాహుల్ రాజీనామా చేయాలని తాను కోరుకోలేదని, అతను పదవిలోనే ఉండాలని కాంక్షిస్తున్నానన్నారు. కార్యకర్తలు కూడా రాహుల్ నేతృత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ఆ ఎన్నికల ఫలితాల అనంతరం పదవికి రాజీనామా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: