ఒక్క పెద్ద బ్యాగ్‌ ని  భద్రంగా కారులో పెట్టి వెళ్లాడు  దాని యజమాని బ్రియాన్‌ గుండె . బ్యాగ్‌ లో  భారీ మొత్తంలో డబ్బు లేదా  నగలు  ఉంటాయి అని భావించి  మెల్లగా  బ్యాగ్‌ను దొంగతనం చేసి అక్కడినుండి పరారు అయ్యారు దొంగలు.తరువాత బ్యాగ్‌ని తెరిచి  చూసే సరికి భయంతో  వణికి పరుగు తీశారు.

ఎందుకంటే భారీ మొత్తం లో డబ్బులు లేదా  విలువైన వస్తువులు ఉంటాయి అని పక్కాగా  ప్లాన్ చేసి  మరి కొట్టేసిన  బ్యాగ్‌లో  పాములు కనిపించడంతో ఆశ్చర్యంతో పాటు  ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు ఆ దొంగలు. అసలు విషయానికి వస్తే  బ్రియాన్‌ గుండే అనే అతను  పాములను పెంచి, వాటిని అమ్ముతుంటారు . రెండు రోజుల క్రితం మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ లైబ్రరీలో ఓ కాన్ఫరెన్స్ కి  వెళ్లారు  గుండే. ఆ సమయంలో తనతో పాటు తీసుకువచ్చిన బ్యాగ్‌ను కారులోనే వదిలి  పెట్టి వెళ్లారు.

దీని అంతా గమనిస్తున్న దొంగలు సమయం చిక్కడం తో గుండె అటు వెళ్లిన వెంటనే బ్యాగ్ ని దొంగలించి అక్కడనుండి జారుకున్నారు.కాన్ఫరెన్స్  అనంతరం  తిరిగి వచ్చి చూస్తే  గుండేకు కారులో పెట్టిన బ్యాగ్‌ కనిపించలేదు. వెంటనే  పోలీసులకు ఫిర్యాదు చేసారు.తన బ్యాగులో విలువైన వస్తువులు ఉంటాయి అని  భావించి ఈ దొంగతనం  చేసి ఉంటారు అని  కానీ, అందులో పాములున్నాయని తెలిపారు.

దొంగతనం చేసిన వారు వాటిని వెంటనే జాగ్రత్తగా తీసుకువచ్చి తనకు అప్పగించాల్సిందిగా కోరాడు. ఇప్పటికే రెండు పాములు బయట కనిపించాయని  ఆ బ్యాగ్ లో ఇంకా పదికి పయిగా పాములు ఉన్నాయి అని చాలా  ఆందోళన వ్యక్తం చేసారు గుండే. తన పాములను క్షేమంగా  వెంటనే  తిరిగి తనకి అప్పగించమని  మీడియా ముందు కోరారు .


మరింత సమాచారం తెలుసుకోండి: