ప్రపంచంలోనే అత్యధికంగా రైలు సేవలు వినియోగించే దేశాలలో భారత్ ఒకటి. ఇక పండుగ రోజుల్లో  ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. పేద,మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి.పెరుగుతున్న జనాభా దృష్టిలో ఉంచుకొని మెట్రో,హై స్పీడ్ రైలు వంటి ఎన్నో సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు.ఈ సందర్భంగా ప్రత్యేకించి నరసాపూర్‌– సికింద్రాబాద్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు  బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసారు.


ఇక విజయవాడ రైల్వే డివిజన్‌లో  ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు  పీఆర్వో నుశ్రత్‌.ఎం.మండ్రూప్‌కర్‌.  రైలు నెంబరు (07053) సికింద్రాబాద్‌ – కాకినాడటౌన్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు కాకినాడటౌన్‌  చేరుతుంది.అలాగే  రైలునెంబరు (07054)  కాకినాడటౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8 గంటలకు కాకినాడటౌన్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40కు సికింద్రాబాద్‌ చేరుతుంది.

నరసాపూర్‌– సికింద్రాబాద్‌ మధ్య మొరొక  ప్రత్యేకరైలురైలునెంబరు (07255) అక్టోబర్‌ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్‌  చేరుతుందని తెలిపారు.రైలునెంబరు (07256) సికింద్రాబాద్‌–నరసాపూర్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.05కు నరసాపూర్‌ చేరుతుంది.

రైలునెంబరు(07255) నరసాపూర్‌ – సికింద్రాబాద్‌  ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.50కు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ ప్రత్యేకరైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీఆర్వో తెలిపారు.  
దసరా పండుగ ముగించుకొని పట్టణాలకు చేరుకునే ప్రయాణికులకు ఈ రైళ్ళతో సులభంగా గమ్య స్థానాలను చేరుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: