ఓ ప్రయాణికుడు కారణంగా ముంబై రైలులో ప్రయాణికులు ఓ గంట సేపు పాటు  ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే ఓ ప్రయాణికుడు ముంబైలోని వశీ రైల్వే స్టేషన్‌లో పన్వేల్‌కు వెళ్లే లోకల్ రైలుపై బ్యాగ్‌ను విసిరాడు. అది కాస్త రైలు ఇంజిన్ మీద ఉండే విద్యుత్ వైర్ల మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు పరుగులు పెట్టడం ప్రారంభించారు. ఈ సంఘటన  బుధవారం ముంబయిలోని వశీ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
 


అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ ఒక్క ప్రయాణికుడి హాని జరగకుండా తొక్కిసలాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రైల్వే సిబ్బంది. ప్రమాదం తర్వాత ఆ బోగీని రైలు నుంచి వేరు చేసి షెడ్‌కు తరలించారు.ఇక లోకల్ రైళ్ల బోగీలపై వైర్ల నుంచి కరెంటును స్వీకరించే కనెక్టర్లు ఉంటాయి. ఇవి విద్యుత్తును గ్రహిస్తేనే రైలు ముందుకు వెళ్తుంది.


ఈ  సంఘటనపై సెంట్రల్ రైల్వే ట్విట్టర్ వేదికగా స్పందించింది. సెంట్రల్ రైల్వే ఈ ఘటనపై ట్విట్ చేస్తూ.. ''గుర్తు తెలియని ప్రయాణికుడు లోకల్ రైలుకు ఉండే పాంటోగ్రాఫ్ మీద బ్యాంగ్ పడేశాడు. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఏర్పడ్డాయి. దీనివల్ల రైలు రాకపోకలకు 12 నిమిషాలు అంతరాయం ఏర్పడింది.. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు రైళ్లపై ఎలాంటి బ్యాగ్‌లు, వస్తువులు తదితరాలు పడవేయవద్దు'' అని ట్వీట్ చేసింది.

అయితే ఈ ప్రమాదం అనుకోకుండా జరిగింద లేక కావాలనే జరిగిందా అనేది ఇంకా వివరాలు  తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటి నుంచి రైలులో ప్రయాణించే తప్పుడు తగ్గు చర్యలు తీసుకోవలసిందిగా మనవి. ఘటన జరిగిన వెంటనే అధికారులు స్పందించడం వల్ల ప్రాణ నష్టం ఏమి జరగలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: