భారత దేశంలో హిందువులు కొలిచే దేవుళ్లకు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఎంతో భక్తితో దేవాలయానికి వెళ్లినపుడు వెంట కొబ్బరికాయ,పూలు,అగర్ వత్తీలు ఏవైనా నైవేద్యాలు తీసుకు వెళ్లి దేవుడికి సమర్పించుకుంటాం. అప్పుడు ఆలయ పూజారి మనల్ని దివిస్తూ ఫలహారం,తీర్థం, హారతి ఇస్తారు..అలాగే  శఠగోపం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఆలయానికి వచ్చిన భక్తులకు పూజారులు శఠగోపం ఎందుకు పెట్టి దీవిస్తుంటారు. దేవుడి దర్శనానికి వెళ్లిన భక్తులకు శఠగోపం పెట్టే ఆచారం ఎందుకు వచ్చింది ? దీనివల్ల ప్రయోజనమేంటి ? గుళ్లో శఠగోపానికి ఎందుకంత ప్రాధాన్యత ? 
 


శఠగోపం అంటే అత్యంత గోప్యామైనది అని అర్థం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. శఠగోపంను శఠగోప్యం, శఠారి అని కూడా పిలుస్తారు. 


విష్ణుపాదాలు ఉన్న శఠగోపంను తలమీద పెట్టినప్పుడు మన కోరికలు భగవంతుడికి తెలపాలని ఈ శఠగోపం వివరిస్తుంది. పూజారికి కూడా వినిపించకుండా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోపం. 


శఠగోపం మన తలపై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి, మానసిక ఉల్లాసం కలుగుతుంది. 


మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి శఠగోపం ద్వారా తీసుకోవటమని మరో అర్థం ఉంది.  


శఠగోపమును రాగి, కంచు, వెండిలతో తయారు చేయడం వెనక మరో అంతరార్థం ఉంది. శఠగోపం తలమీద ఉంచినప్పుడు శరీరానికి లోహం తగలడం ద్వారా విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బయటకి వెళ్లిపోతుంది. దీని ద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: