"సుతామ్రవర్ణీజలరాశియోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యైః |
శ్రీరామచంద్రేణ, సమర్పితం తం రామేశ్వరాఖ్యాం నియతం నమామి ||"


కాశీ నుంచి గంగా జలాన్ని రామేశ్వరం తీసుకువెళ్లటం, ఈ నాలుగు సుధామాల యాత్రలో అతి పుణ్యకార్యంగా భావించబడింది. కాశీలోని బిందుమాదవం వద్ద గంగా స్నానం చేసి అక్కడి పవిత్ర జలాన్ని రామేశ్వరంలో అర్పిస్తారు. రామేశ్వరంలోని ధనుష్కోటి సేతుమాధవంలో స్నానం చేసి అక్కడి ఇసుకను తీసుకెళ్లి ప్రయాగ(అలహాబాదు) లోని వేణీమాధవం దగ్గర గల త్రివేణీ సంగమంలో సమర్పిస్తారు. మళ్లీ త్రివేణీ సంగమంలోని గంగాజలాన్ని ఇళ్లకు తెచ్చుకుంటారు.  ఇలా చేసినందువల్లే నాలుగు పుణ్యక్షేత్రాల యాత్ర సఫలమౌతుందని అంటారు. భారతదేశపు దక్షిణ దిశాంతంలో దక్షిణ-పూర్వ దిశలో రామేశ్వర సముద్ర తీర్థ ఉంది. జ్యోతిర్లింగ రూపుడైన దేవునితో ఈ క్షేత్రం నాలుగు పవిత్ర తీర్థ స్థానాలలో ఒకటి.


స్కంధ పురాణం, శివపురాణం, వంటి గ్రంథాలలో రామేశ్వర మహిమ వర్ణించబడింది. 
శ్రీ రామేశ్వర స్థలపురాణం ఇదీ:
సీతాదేవిని కోల్పోయిన దుఃఖంతో అడవులంట తిరుగుతున్న రాముడు సుగ్రీవునితో మైత్రి చేస్తాడు. అతని ప్రత్యేక దూతిన హనుమంతుడి సహాయంతో సీత ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటాడు. ఆ తరువాత రావణునిపై యుద్ధం చేసే ఉద్దేశంతో వానరసేనను కూర్చుకొని దక్షిణ సముద్ర తీరం వైపుకు వెళ్లాడు రాముడు. సముద్రాన్ని దాటడం ఎలాగ అనేది ఒక సమస్య అయింది. శివభక్తుడైన రాముడు చింతాగ్రస్తుడు కావటం చూసి లక్ష్మణ సుగ్రీవాదులు అతనికి ధైర్యం చెప్పారు. కానీ శివుని ద్వారా వరప్రాప్తుడైన రావణుని గురించి నిశ్చింతులుకాలేక పోయారు. ఇలా ఉండగా, ఒకసారి దాహార్తుడైన రాముడు నీరు కావాలని కోరాడు. నీటిని నోటిలో పోసుకోబోతుండగా అతడికి శివపూజ చేయాలని స్పూరించింది. వెంటనే ఒక మట్టి లింగాన్ని తయారుచేసి షోడశోవచార పూజలతో శివుణ్ణి ఆరాధించాడు.


శ్రీరాము ఆర్తుడై, శ్రద్ధాపూర్వకంగా శివుణ్ణి ప్రార్ధించి, ఉచ్చస్వరంలో జయజయనాదాలు చేస్తూ నోటితో 'అగడ్ బం, బం అనే శబ్ధాలను ఉచ్చరిస్తూ ప్రార్ధించాడు. నృత్యం చేశాడు. ఇది చూసి ప్రసన్నుడై శివుడు ప్రత్యక్షం అయి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. రాముడు శివుణ్ణి పలు విధాల స్తూతించాడు. "మీకు నాపై దయ ఉంటే, ఈ ప్రపంచాన్ని పవిత్రం చేసి పరోపకారానికై, మీరు ఇక్కడే నివాసం ఏర్పరుచుకోండి ప్రభూ" అని కోరాడు. "ఏవమస్తు" అని శివుడు పలికాడు. అప్పటి నుంచీ రామేశ్వరుడనే పేరుతో శివలింగ రూపుడై అక్కడి భూమిపై వెలశాడు.


శివకృపచే రాముడు రావణాది రాక్షసులను హరించి విజయుడయ్యాడు. రామేశ్వర మహాదేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో, రామేశ్వరంలోని శివలింగంపై ఎవరైతే దివ్య గంగా జలాన్ని జల్లుతారో వారికి విముక్తి లభించి, కైవల్యమోక్ష ప్రాప్తి కలుగుతుంది. జ్యోతిర్లింగం వెలసిన చోట ఒక విశాల, సుందర ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయపు వాస్తుశిల్ప విషంలో ప్రపంచంలో ఒక శ్రేష్టమైన ప్రతీకగా భావించబడుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని రామనాడ్ జిల్లాలో ఒక విశాలమైన ఇసుక ద్వీపంపైన ఈ ఆలయం నిర్మించబడింది. ఇది తప్పక చూసి తీరవలసిందే. ఈ దివ్యభవ్య రామేశ్వర ఆలయపు ప్రవేశ ద్వారంపై పది అంతస్తులు గల గోపురం ఉంది. దీని కట్టడం, చెక్కడం, విగ్రహాలు మరియు గోపురాలు చూసినవారు ఆశ్చర్యచకితులౌతూంటారు. దేవుడి విరాట్ స్వరూపంలో ఇక్కడ ప్రత్యక్షం అయినట్లుంటుంది. భక్తులు ఇక్కడికి వచ్చాక తమ సంకుచిత మనస్తత్వం పోయి విశాల దృక్పథం పొందినట్లు భావిస్తారు.


ఆలయంలో ఎత్తయిన శిలాస్తంభాలపై సుందర చిత్రాలు చెక్కబడ్డాయి. తొండాన్ని పైకెత్తి నిలబడిన ఏనుగుల రాతి చెక్కడాలు కనిపిస్తాయి. ఆలయం నలువైపులా రాతితో చేయబడి భారీ, దృఢం అయిన గోడలున్నాయి. వాటి వెడల్పు 650అడుగులు, ఎత్తు 125 అడుగులు. ఈ ఇసుక ద్వీపంపై కట్టిన  భవ్యమందిరపు శిల్ప నైపుణ్యం చూసినవారు చాలా ప్రభావితులౌతూంటారు. ఒక సువర్ణఖచిత స్తంభం దగ్గర 13అడుగుల ఎత్తు, 9అడుగుల ఎత్తూ గల నంది విగ్రహం ఏకశిలా శిల్పంగా మలచబడి ఉంది. ఇక్కడి విగ్రహ కళానైపుణ్యానికి ఇదొక చక్కని నమూనా.


శ్రీరామేశ్వర ముఖ్యాలయం దగ్గరగా పార్వతి-పర్వతవర్థిని యొక్క పురాతన ఆలయం ఇంది. ఇదిగాక, సంతాన గణపతి, వీరభద్ర హనుమాన్, నవగ్రహాలు, అమ్మన్ దేవి ఇత్యాధి ఆలయాలు కూడా ఉన్నాయి.  ఈ ద్వీపంపై ముఖ్య ఆలయం నుంచి సుమారు 2కిలోమీటర్ల దూరంలో గంధమాధన పర్వతం శిఖరం ఉంద. ఎవరో ఇక్కడ ఒక కోటను నిర్మించారు. రామ్ ఖయీ (గుండం), రామ్ ఝరోఖా, విభీషణ ఆలయం ఇత్యాది స్థానాలు దర్శనీయం. ఇసుక నేల అయినప్పటికీ ఇక్కడ పచ్చని తోటలు కళకళలాడుతూ దర్శనమిస్తాయి. రామేశ్వరుని నందనవనం ఇది.


ఈ తర్థంలో రామ తీర్థం, సీతాకుండం, జటా తీర్థం, లక్ష్ణ తీర్థం, కపితీర్థం, బ్రహ్మకుండం, విపువినీతీర్థం, గాలవతీర్థం, కోదండరామతీర్థం, పాండవతీర్థం వంటివి 24తీర్థాలున్నాయి. అన్ని తర్థాలలో నీరూ తియ్యగా ఉంటుంది. ప్రతి తీర్థంలోని నీటికి తనదైన రుచి ఉంది. ప్రతి తీర్థానికీ ఒక కథ ఉంది. ఈ తీర్థాలు అన్నిటిలోనూ భక్తులు స్నానం చేసి, ఆ స్నానం వల్ల తమ మనసు, శరీరమూ కూడా నిర్మలం అయ్యాయని భావిస్తారు.


శ్రీ రామేశ్వర దేవాలయపు నిర్వహణ అంతా భారత ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. ఆలయపు వ్యవస్థ నిర్వహణ అన్నీ కూడా సవ్యంగా చేయబడుతున్నాయి. ఈ క్షేత్రహంలో భిక్షాటన చేయటం, ముష్టి వేయటం రెండూ వీలులేదు. ఎవ్వరూ మిమ్మల్ని దేనికీ యాచించరు. ఇక్కడి అందరు కర్మచారులూ ప్రభుత్వ ఉద్యోగులే. ఇక్కడి కార్యకుశలత చూసి భక్తులు ముగ్ధులౌతూంటారు.


దేవుని పూజా విధులు, దానధర్మాల రేట్లు నిర్ధారితమైనవి. మొదట కార్యాలయంలో రొక్కం చెల్లించి, రసీదు తీసుకోవాలి. ఈ రసీదును పూజా ద్రవ్యాల పాత్రలో ఉంచి పూజారికి ఇవ్వాలి. పూజా విధానాన్ని దూరం నుంచే చూడాలి. పూజానంతరం ప్రసాదం లభిస్తుంది.
వెండిరేకులతో మలచబడిన వేదికపై తెల్లగా ధగధగలాడే రత్నాల తాపడం కలిగిన లింగమూర్తిపై, శేషనాగు పడగ విప్పిన ముద్రలో ఉంటుంది. ఈ లింగంపై గంగోదకం మరియు బిల్వ పత్రాలు అర్పిస్తారు. రామేశ్వరుని దర్శనానంతరం భక్తజనులు పావనం అయ్యామని భావిస్తారు. ప్రదోషకాలం, శివరాత్రి వంటి పండుగలప్పుడు రామేశ్వరుని పల్లకీలో కూర్చుండబెట్టి ఊరేగిస్తారు. మంగళవారం, శుక్రవారం పార్వతీదేవి యొక్క 3అడుగుల స్వర్ణ ప్రతిమను పల్లకీలో తీసుకెడతారు.


ఉత్సవ విగ్రహాలకు వస్త్రాది అలంకారాలను చేస్తారు. అన్ని పండగలూ, ఉత్సవాల అపుడు గుడి అంతా దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాల శోభ చూడవలసిందే. ప్రతి రోజూ ఉదయం 4గంటల నుండి రాత్రి 10గంటల వరకూ గుడికి భక్తులు వస్తూనే ఉంటారు. పూజలు జరుగుతూనే ఉంటాయి. రాత్రి హారతి తరువాత దేవుడి శయనాగారంలో బంగారపు ఉయ్ాలలో శంకర, పార్వతుల భోగ విగ్రహాలనుంచుతారు.


ఇక్కడ మహాశివరాత్రి మరియు ఆషాఢ మాసాలలో 15రోజులు ఒక పెద్ద మేళా జరుగుతుంది. ఇది చాలా అట్టహాసంగా జరుగతుంది. భారదేశం నలుమూలలూ, మరియు నేపాలు వంటి చోట్ల నుంచీ కూడా రామేశ్వరుని దర్శనార్థం భక్తులు వస్తూంారు. జ్యోతిర్లింగం దర్సనం చేసుకుంటారు. వివిధ రకాల వేషభూషలవారు, భాషలవారూ ఇక్కడ అగుపిస్తారు. భారదేశపు ఐక్యమత్యభావం ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది.

జయ శ్రీ రామేశ్వర! జయ శ్రీ రామేశ్వర!


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది శ్రీ నాగేశ్వరుడు. క్షేత్ర ప్రాధాన్యత, చరిత్ర కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి: