దేవాలయానికి వెళ్లినప్పుడు దైవ దర్శనానికి ముందుగా ప్రదక్షిణం చేస్తాం. మామూలుగా మూడు మార్లు గుడి చుట్టూ తిరుగుతారు. తరువాతనే గుడి లోపలికి ప్రవేశించటం ఉంటుంది.


దర్శనము, పూజాదికాలు అయిన తరువాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. తన చుట్టూ తానే గిర్రున కుడి వైపుగా తిరగటం ఆత్మ ప్రదక్షిణం. నమస్కార ముద్రతో గుడి చుట్టూ తిరిగితే మాత్రం ప్రదక్షిణం అని మాత్రమే అనటం జరుగుతోంది.


అసలు ఇలా ప్రదక్షిణం చెయ్య వలసిన అవసరం ఏమిటి ? స్థిరంగా ఉన్న వస్తువులో శక్తి అంతర్నిహితంగ, నిద్రాణంగా ఉంటుంది. కదిలితే చలన శక్తిగా వ్యక్తమౌతుంది. గుండ్రంగా తిరగటం వల్ల వస్తువు శక్తివంత మౌతుంది.


సూర్యుని చుట్టూ భూమి ఏ విధంగానయితే శక్తిని పొందుతోందో అదే విధంగా భూమిపై జీవిస్తున్న మానవుడు కూడా భ్రమణం, పరిభ్రమణం చేస్తే శక్తిమంతుడవుతాడుతాడు . ప్రతి మనిషి లోనూ దైవ శక్తి అంతర్నిహితంగా ఉంటుంది. అది ఆత్మస్వరూపంగా ఉంటుంది. మనిషి దైవం చుట్టూ తిరిగి అంటే ప్రదక్షిణం చేసి తనలో దైవీ శక్తిని పెంపొందించుకుంటాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: