హిందువులు జరుపుకొనే ముఖ్యమైన పండుగలో విజయదశమి ఒక్కటి. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు.పూర్ణం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషూ అంటే దున్నపోతు అందుకే మహిషాసురుడు అనే పేరు వచ్చింది. మహిషాసురుడు ముల్లోకాలు చేయించాలని కోరిక పుట్టింది. అందుకే ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ దేవుని నుంచి వరం పొందాడు.వరం పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించే వాడు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కూడా ఏం చేయలేకపోయారు. దాంతో అతన్ని ఎదుర్కొనేందుకు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిషాసురుడు చావు  ఒక స్త్రీ చేతిలో ఉంది అని గమనించి బలవంతమైన స్త్రీని సృష్టించారు.  అలా వాళ్ళ అందరి అంశాలతో పుట్టిన దేవత దుర్గా దేవి. శరత్ ఋతువులో తొమ్మిది రోజులపాటు యుద్ధం జరిగింది కాబట్టి ఈ పండుగ రోజున శరన్నవరాత్రులు అంటారు.పదవ రోజు విజయం వరించింది కాబట్టి దసరా అంటారు.

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో  దుర్గామాతని రోజుకు అవతారంలో పూజిస్తారు.విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.మూడో రోజున దుర్గాదేవి గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.  సకల వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విద్రుమ, హేమ,నీల, ధవళ, వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా తెల్లవారు సమయం లో గాయత్రిగాను,మధ్యాహ్న సమయంలో సావిత్రి గాను సాయం సమయంలో సరస్వతి గాను పూజారులతో దుర్గామాత ఆరాధనలు అందుకుంటుంది.గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ,హృదయంలో విష్ణువు,శిరంపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.గాయత్రి మంత్రం జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది . ఈ రోజున భక్తులు అమ్మవారికి నివేదన చేస్తారు.గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసి గాయత్రి మంత్రం పారాయణం చేయాలి.


    మరింత సమాచారం తెలుసుకోండి: